డయల్ 112, తెలుగు రాష్ట్రాలతో సహా 16 రాష్ట్రాల్లో అత్యవసర సేవలకు కేవలం ఒకే నంబర్

Updated on 20-Feb-2019
HIGHLIGHTS

ఇప్పుడు అత్యవసర సేవల కోసం కేవలం 112 నంబరును మాత్రమే డయల్ చేస్తే సరిపోతుంది.

ఇప్పటివరకు అత్యవసర సేవల కోసం విడివిడిగా అంక నంబర్లను డయల్ చేయవలసి వచ్చేది. ఉదాహరణకి, పోలీసుల కోసం 100 డయల్ చేయాల్సిరాగా మెడికల్ ఎమర్జెన్సీ కోసం 108 చేయాల్సివచ్చేది. అలాగే, చాల అత్యవసర సేవల కోసం విడివిడిగా నంబర్లకు ఫోన్ చేయాల్సి వచ్చేది. అయితే, ఇప్పుడు కేంద్రం తీసుకున్న ఒక మంచి నిర్ణయంతో ఈ సమస్య వైదొలిగింది. అదేమిటంటే, దేశమంతటా అన్ని అత్యవసర సేవల కోసం కేవలం ఒకే నంబరును సంప్రతించడం.

కేంద్ర హోమ్ మినిస్టర్, రాజ్ నాథ్ సింగ్ చేతుల మీదగా ఈ కొత్త అత్యవసర సేవా నంబర్ 112 లాంఛన ప్రాయంగా ప్రారంభించబడింది. భారతదేశమంతటా ఈ అత్యవసర సేవా నంబర్ 112 సేవలు వచ్చే సంవత్సరానికల్లా అందుబాటులోకి రానున్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణతో సహా రెండు కేంద్రపాలిత ప్రాంతాలను కూడా కలుపుకుని 16 రాష్ట్రాలలో ఈ సేవలు వెంటనే ప్రారంభమయ్యాయి.

112 india మొబైల్ ఆప్

అత్యవసర సేవల కోసం  గూగుల్ ప్లే స్టోర్ నుండి "112 india" పేరుతొ ఒక ఆప్ ను  కూడా అందిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నపుడు, సహాయాన్ని అర్ధించే వారి యొక్క పేరు,అడ్రెస్స్,వయసు మరియు ఎమర్జెన్సీ కాంటాక్ట్ నామారుతో సహా, దగ్గర్లోని వాలంటీర్లను అప్రమత్తం చెయ్యడానికి అందిస్తుంది.కేవలం, 112 కి ఫోన్ చేయడంతో మీ లొకేషన్ తో సహా అన్ని వివరాలు దగ్గరలోని వాలంటీర్లకు అందించబడతాయి.

మరొక ప్రత్యకమైన ఫిచర్ : 

మాకు అనుకోకుండా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు కేవలం ఎం ఫోన్లోని పవర్ బటన్ని మూడు సార్లు త్వర త్వరగా నొక్కడం ద్వారా  పానిక్ కాల్ ని ఆక్టివేట్ చ్యవచు, స్మార్ట్ ఫోన్ వాడని వీరు 5 లేదా 9 నంబరును దీర్ఘంగా నొక్కడం ద్వారా దీన్ని యాక్టివేట్ చేయవచ్చు. ఇలా చేయండం ద్వారా ఎమర్జెన్సీ రెస్పాన్క్ సెంటర్ (ERC) వద్ద ఏ పానిక్ కాల్ నమోదు చేయబడుతుంది. కాబట్టి,ఎం కావాల్సిన సహాయాన్ని అందించడానికి వీలుంటుంది.                           

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :