ఈ మూడు హానికరమైన యాప్స్ మీ ఫోన్ లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి..!

Updated on 19-Oct-2021
HIGHLIGHTS

150 పైగా హానికరమైన యాప్స్

కొత్తగా మరొక మూడు ప్రముఖ యాప్స్

కీలకమైన మరియు సున్నితమైన డేటాను సేకరిస్తున్నట్లుగా గూగుల్ గుర్తించింది

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ ఇటీవల చేపట్టిన రివ్యూ ద్వారా 150 పైగా హానికరమైన యాప్స్ ను నిషేధించింది. ఇప్పుడు కొత్తగా మరొక మూడు ప్రముఖ యాప్స్ ను కూడా నిషేధించింది. ఈ మూడు యాప్స్ కూడా స్మార్ట్ ఫోన్ వినియోగదారుల కీలకమైన మరియు సున్నితమైన డేటాను సేకరిస్తున్నట్లుగా గూగుల్ గుర్తించింది. అందుకే, గూగుల్ తన యాప్ స్టోర్ నుండి ఈ మూడు యాప్స్ తొలిగించింది. ఒకవేళ మీరు కూడా మీ ఫోన్ లో ఈ యాప్స్ డౌన్లోడ్ చేసుకుని ఉంటే వెంటనే డిలీట్ చెయ్యడం మంచింది.

ఏమిటా మూడు హానికరమైన యాప్స్?

గూగుల్ తన యాప్ స్టోర్ నుండి తొలగించిన ఆ మూడు యాప్స్ ఏవంటే

1.Magic Photo Lab – Photo Editor

2. Blender Photo Editor-Easy Photo Background Editor

3. Pix Photo Motion Edit 2021

పైన పేర్కొన్న యాప్స్ ను గూగుల్ నిషేధించింది. మీరు కూడా ఈ యాప్స్ మీ ఫోన్ లో ఉంటే వెంటనే తొలగించండి.

హానికరమైన యాప్స్ ఏమి చేస్తాయి?

వినియోగదారుల నుండి కీలకమైన లేదా సున్నితమైన డేటాని దొంగిలించే యాప్స్ ను హానికరమైన యాప్స్ గా గూగుల్ ప్లే స్టోర్ నుండి గుర్తిస్తుంది. ఈ యాప్స్ మీ లాగ్-ఇన్ వివరాలను షేర్ చేసేవిధంగా మిమ్మలను మోసగిస్తాయి. అంతేకాదు, కొని యాప్స్ మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను కూడా షేర్ చేసే విధంగా మిమల్ని మభ్యపెడతాయి.

అందుకే, ఇటువంటి మోసపూరితమైన యాప్స్ మీ ఫోన్ లో ఉండడం ప్రమాదకరం. కాబట్టి, పైన పేర్కొన్న మూడు యాప్‌లలో దేనినైనా డౌన్‌లోడ్ చేసినట్లయితే, మీరు వాటిని మీ స్మార్ట్‌ఫోన్ నుండి వెంటనే తొలగించాలి. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :