స్మార్ట్ వాచ్: 8GB స్టోరేజ్, సూపర్ AMOLED తో స్మార్ట్ వాచ్ లాంచ్ చేసిన Crossbeats

Updated on 17-May-2022
HIGHLIGHTS

Crossbeats సరికొత్త స్మార్ట్ వాచ్ Orbit Infiniti ను ఇండియాలో విడుదల చేసింది

ఇది కొత్త తరం స్మార్ట్‌వాచ్

ఈ స్మార్ట్ వాచ్ 1.39 inch సూపర్ AMOLED డిస్ప్లేతో వచ్చింది

భారతీయ కంజ్యుమర్ టెక్నాలజీ బ్రాండ్ Crossbeats సరికొత్త స్మార్ట్ వాచ్ Orbit Infiniti ను ఇండియాలో విడుదల చేసింది. ఇది కొత్త తరం స్మార్ట్‌వాచ్ మరియు యువకులకు మరియు పెద్దలకు సరిపోయే అసమానమైన సరికొత్త ఫీచర్‌ లతో పూర్తిగా లోడ్ చేయబడింది. అంతేకాదు, ముందెన్నడూ చూడని విధ్దంగా ఇండస్ట్రీ-ఫస్ట్  1.39 inch సూపర్ AMOLED డిస్ప్లేతో వచ్చింది మరియు ఇది 3D కర్వ్ తో సొగసైన మరియు అందమైన రూపాన్ని ఇస్తుంది. మరి క్రాస్ బీట్స్ తీసుకొచ్చిన ఈ లేటెస్ట్ స్మార్ట్ వాచ్ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా.

ఈ స్మార్ట్ వాచ్ 8 GB లేదా 1500+ పాటల వరకు స్టోరేజ్ స్పెస్ తో వస్తుంది. వీటితో పాటుగా, బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేయడానికి ఇది నెక్‌బ్యాండ్‌తో పాటు TWS కి అనుకూలంగా ఉంటుంది. ఈ సరికొత్త Crossbeats స్మార్ట్‌వాచ్ బ్లూటూత్ కాలింగ్‌తో కూడా అమర్చబడి ఉంది మరియు దానిలోని అంతర్నిర్మిత స్పీకర్లు వాచ్ ద్వారా వాయిస్ కాలింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ప్రీమియం స్మార్ట్‌వాచ్, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కలిగి ఉంది. ఈ స్మార్ట్ వాచ్ crossbeats.com లో రూ. 6,999 ప్రారంభ ధరతో లిస్ట్ చేయబడింది.

ఈ స్మార్ట్ వాచ్ 110 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌ లతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 15-రోజుల బ్యాటరీ బ్యాకప్ ని అందిస్తుంది మరియు స్మార్ట్‌వాచ్‌ని మళ్లీ మళ్లీ ఛార్జ్ చేసే ఇబ్బంది పడకుండా చేసింది. అంతేకాదు, ఛార్జింగ్ ఇబ్బంది లేకుండా రోజుల తరబడి వాడకాన్ని నిర్ధారిస్తుంది. ఈ Orbit Infiniti స్మార్ట్ వాచ్ పైన్ గ్రీన్, కాపర్ బ్రౌన్, గ్రాఫైట్ బ్లాక్ మరియు ఐస్ గ్రే అనే అందమైన కలర్ అప్షన్ లలో లభిస్తుంది, మీరు మీ వ్యక్తిత్వానికి అనుగుణంగా మీకు తగిన కలర్ ను ఎంచుకోవచ్చు.    

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :