create your own New Year Wishes 2026 wishes with the help of AI
2026 New Year Wishes: కొత్త ఆశలు మరియు నూతన ఉత్సాహం నింపడానికి నూతన సంవత్సరం వచ్చేసింది. రేపు అర్ధరాత్రి నుంచి ఇష్టమైన లేదా ప్రియమైన వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు పంపడం మీకు మరియు మీకు ఇష్టమైన వారికి కొత్త సంవత్సరం కొత్త పలకరింపు అవుతుంది. అందుకే, ఆ మొదటి పలకరింపు ఎంత అర్థవంతంగా ఉంటే ఈ సంవత్సరం అంత కొత్తగా ఉంటుందని చెబుతారు. అందుకే, ఒకరు నుంచి వచ్చే మెసేజ్ ఫార్వర్డ్ చేసే కంటే, మీరే క్రియేటివ్ మెసేజ్ క్రియేట్ చేసి సెండ్ చేయడం మరింత బాగుంటుంది. అందుకే, AI సహాయంతో న్యూ ఇయర్ విషెస్ సరికొత్తగా చెప్పడానికి మేము మీకు సహాయం చేస్తాము.
పెరిగిన టెక్నాలజీ తో AI ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు. Chat GPT, Google Gemini మరియు perplexity వంటి మరిన్ని ఎఐ ప్లాట్ ఫామ్స్ ఉచితంగానే మీకు అందుబాటులో ఉన్నాయి. వీటి సహాయంతో మీరు విషెస్ ను సరికొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు తగిన ప్రాంప్ట్ ఉపయోగిస్తే సరిపోతుంది. మీకు సహాయం చేయడానికి మీకు తగిన ప్రాంప్ట్ ను ఈరోజు మేము అందించాము. ఈ ప్రాంప్ట్ సహాయంతో మీరే విషెస్ సొంతంగా క్రియేట్ చేసి సెండ్ చేయండి.
సింపుల్ మెసేజ్ పొందడానికి, ఏదైనా ఎఐ ప్లాట్ ఫామ్ నుంచి “Write heart-touching New Year 2026 wishes in Telugu language” అని ప్రాంప్ట్ అందిస్తే, మీకు బెస్ట్ 10 తెలుగు విషెస్ అందిస్తుంది.
“Create a New Year 2026 wish for my friend Raja, who struggled a lot in 2025 but never gave up”
“Write an emotional New Year 2026 wish for family and loved ones” మీ మెసేజ్ ను తెలుగులో కన్వర్ట్ చేసుకోవచ్చు. మీరు అందించే ప్రాంప్ట్ ను బట్టి మీరు కోరుకునే మెసేజ్ ను క్రియేట్ చేసుకోవచ్చు.
న్యూ ఇయర్ ఇమేజ్ 2026 కోసం కొత్త ఇమేజ్ క్రియేట్ చేయడానికి చాట్ జిపిటి ఇమేజ్, గూగుల్ జెమినీ నానో బనానా మరియు Canva చాలా ఉత్తమం మరియు ఉచితంగా కూడా వస్తాయి. “Create a New Year 2026 greeting image with fireworks, golden text ‘Happy New Year 2026’, elegant background” ప్రాంప్ట్ యూజ్ చేయండి. అంతేకాదు, ఇందులో మీరు కావాలనుకుంటే తెలుగు టెక్స్ట్ కూడా జత చేసుకోవచ్చు.
Also Read: Cyber Crime మోసాలతో ప్రతి రోజు ప్రజలు పోగొట్టుకునే డబ్బు ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు.!
మీ వాట్సాప్ స్టేటస్ కోసం మీరు మీకు నచ్చిన విషెస్ వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. దీనికోసం, Canva (Video AI), InVideo AI, Pictory, జెమినీ Veo వంటి వాటి ద్వారా చేయవచ్చు.
ప్రాంప్ట్ : “Create a 10-second New Year 2026 wish video with fireworks, countdown, soft music, and glowing text”
వాస్తవానికి, చాట్ జిపిటి ద్వారా ప్రాంప్ట్ క్రియేట్ చేసి, పెయిన్ తెలిపిన వీడియో ప్లాట్ ఫామ్స్ నుంచి వీడియోలు క్రియేట్ చేయవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ కొత్త సంవత్సరంలో సరికొత్తగా శుభాకాంక్షలు తెలపండి.