కరోనా వైరస్ నిరోధించే వ్యాక్సిన్ కోసం ముమ్మర ప్రయత్నాలు : ప్రస్తుత ప్రత్యామ్నాయాలు ఇవే

Updated on 15-Apr-2020
HIGHLIGHTS

కోవిడ్ -19 వ్యాప్తి నుండి ప్రతి ఒక్కరినీ రక్షించడానికి, వైద్యులు కొన్ని మందులను గతంలో కంటే వేగంగా ఉపయోగిస్తూనే, వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తునారు.

నావల్ కరోనోవైరస్ మహమ్మారి మూడు నుండి నాలుగు నెలల వయస్సు, అయినప్పటికీ, ఇంత కాలం ఉన్నప్పటికీ, ఎటువంటి మందులు ఈ వైరల్ వ్యాధిని ఎదుర్కోగలవో అనేవిషయం అస్పష్టంగా ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరపున లేదా కొన్ని మెడిసిన్ కంపెనీలు దీనికోసం తమ వంతు కృషిని విస్తృతంగా చేస్తున్నా కూడా ఇప్పటివరకూ దీనికోసం సరైన వ్యాక్సిన్ గురించిన ప్రకటన రాలేదు. అయితే, ఒక వైపు వ్యాక్సిన్ లేకపోయినా, ప్రజల ఆరోగ్యాన్ని సరిగ్గా ఉంచడానికి మరియు కోవిడ్ -19 వ్యాప్తి నుండి ప్రతి ఒక్కరినీ రక్షించడానికి,  వైద్యులు కొన్ని మందులను గతంలో కంటే వేగంగా ఉపయోగిస్తూనే, వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తునారు.

జనవరి మరియు ఫిబ్రవరిలో నావల్ కరోనోవైరస్ చైనా ద్వారా వ్యాపించినప్పుడు, పరిశోధకులు మరియు వైద్యులు నోవల కరోనావైరస్ వల్ల కలిగే COVID-19 కు వ్యతిరేకంగా ఉన్న ఔషధాలను పరీక్షించడానికి డజన్ల కొద్దీ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించారు. కానీ చైనాలో ఇప్పటివరకు నిర్వహించిన పరిశోధనలో నిశ్చయాత్మకమైన సమాధానం ఇవ్వడానికి తగిన డేటా లేదు.

"పరిశీలనాత్మక వైద్య విజ్ఞానాన్ని ప్రయోగాత్మకంగా అంచనా వేసిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులను మేము అభినందిస్తున్నాము" అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రో అడ్నోమ్ ఒక విలేకరుల సమావేశంలో అన్నారు. "వివిధ పద్ధతులతో కూడిన అనేక చిన్న ప్రయత్నాలు కనిపించాయి, అయినప్పటికీ మనకు అవసరమైన చికిత్సలు ప్రాణాలను కాపాడటానికి సహాయపడతాయనడానికి ఇది బలమైన సాక్ష్యాలను అందించదు."

ఈ పరీక్ష సరళంగా ఉంటుంది మరియు కాలక్రమేణా అదనపు చికిత్సా విధానాలను లేదా ప్రదేశాలను దీనికి జోడించవచ్చు లేదా వదలవచ్చు. అందుకని, ఫిబ్రవరిలో యుఎస్‌లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ ప్రారంభమైన అనుకూల పరీక్షకు సమానంగా కనిపిస్తుంది. ప్రారంభంలో నివారణ పరీక్షించడానికి షెడ్యూల్ చేయబడింది, కానీ ఇతర ఔషధాలకు కూడా విస్తరించవచ్చు . ప్రస్తుతం WHO ఎంక్వయిరీలో US చేర్చబడలేదు.

వందలాది ఇతర క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి, మరియు ఇతర గ్రూప్స్ కూడా WHO ఎంచుకున్న మెడిసిన్  పరీక్షించడం కొనసాగిస్తున్నాయి – ఇక్కడ మేము మీకు చూపిస్తున్న కొన్ని మందులు ఈ జాబితా ఉన్నాయి. అయితే, మేము అన్ని మెడిసిన్స్  గురించి మీకు చెప్పడం లేదు. అంతేకాదు, మీరు వాటిని ఇంట్లో ఉపయోగించటానికి ప్రయత్నించవద్దని కూడా మిమ్మల్ని అభ్యర్ధిస్తున్నాము.

క్లోరోక్విన్ మరియు హైడ్రాక్సీక్లోరోక్విన్

హైడ్రాక్సీక్లోరోక్విన్ మరియు సంబంధిత క్లోరోక్విన్ ప్రయోగశాలలో పరీక్షించినప్పుడు, ఇతర కణాలకు సోకకుండా నోవల్ కరోనోవైరస్లను నిరోధించగలదని కనుగొంది మరియు ఇది COVID-19 ఉన్న రోగులకు సహాయపడగలదని ఈ వృత్తాంత ఆధారాలు సూచిస్తున్నాయి. ఈ మెడిసిన్, యాంటీ మలేరియల్ చికిత్సగా దశాబ్దాలుగా ఉన్నందున, శాస్త్రవేత్తలకు దానితో అనుభవం ఉంది.

లోపినావిర్ – రిటోనావిర్

ఫిబ్రవరిలో, థాయ్‌లాండ్‌ లోని వైద్యులు తమ COVID-19 రోగులను రెండు HIV మెడిసిన్ కలయికతో మెరుగుపరిచినట్లు కూడా చెప్పారు. లోపినావిర్-రిటోనావిర్, WHO తన పరీక్షలో ఈ మందుల కలయికలను పరీక్షిస్తోంది, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇంటర్ఫెరాన్ బీటా, శరీరం సహజంగా వైరస్ను నివారించడానికి ఉత్పత్తి చేస్తుంది. SARS మరియు MERS వ్యాప్తి సమయంలో ఈ మందుల కలయిక రోగుల పైన ఉపయోగించబడింది మరియు ఇది సహాయంగా కనిపించింది.

REMDESIVIR

యాంటీవైరల్ డ్రగ్ రెమెడావిర్ మొదట ఎబోలా చికిత్స కోసం అభివృద్ధి చేయబడింది, కాని తరువాత చేసిన పరిశోధనలలో ఇది కణాలలో MERS మరియు SARS ని కూడా నిరోధించగలదని తేలింది. ఇది కణాలలో నోవల్ కరోనావైరస్ లను కూడా నిరోధించగలదని ల్యాబ్ పరీక్షలు చూపించాయి.

ఇది కాకుండా, శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధన చేస్తున్న అనేక ఇతర మందులు ఉన్నాయి, అయినప్పటికీ, దీనిని పూర్తిగా నిర్వీర్యం చేయగలవనే నిర్ణయానికి ఇంకా చేరుకోలేదు. కానీ,  కరోనావైరస్ చికిత్స కనుగొనబడిందని చెప్పవచ్చు. ప్రస్తుతం పరీక్ష మాత్రమే జరుగుతోంది. శాస్త్రవేత్తలు తమ టెస్టింగ్ ల్యాబ్స్ లో ఈ మెడిసిన్ పరిశోధనలు చేస్తున్నారు. ఈ టెస్టింగ్స్ నిరంతరం కొనసాగుతోంది, ఇప్పుడు మనకు కరోనావైరస్ యొక్క మెడిసిన్ ఎప్పటి వరకూ వస్తుందో చూడాలి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :