ChatGPT Photo Editing Prompts: AI తో ఫోటో ఎడిటింగ్‌ లో కొత్త ట్రెండ్ సెట్ చేయండి.. 10+ బెస్ట్ ప్రాంప్ట్ లు కూడా అందించాము.!

HIGHLIGHTS

Open AI యాజమాన్యంలోని చాట్ జిపిటి క్రియేటివిటీ పనులను చాలా సులభతరం చేస్తుంది

ChatGPT Photo Editing Prompts ఇమేజ్ లను క్రియేట్ చేయటానికి సహాయం చేస్తుంది

కొత్తరకం ఇమేజ్ లను క్రియేట్ చేసి మీరు కూడా కొత్త ట్రెండ్ సెట్ చేయవచ్చు

ChatGPT Photo Editing Prompts: Open AI యాజమాన్యంలోని చాట్ జిపిటి క్రియేటివిటీ పనులను చాలా సులభతరం చేస్తుంది. ముఖ్యంగా ఫోటో ఎడిటింగ్ కోసం అద్భుతమైన ఎడిటింగ్ ప్రాంప్ట్ లను అందించడంలో చాట్ జిపిటి గొప్ప సహాయకారిగా ఉంటుంది. ఎటువంటి ఎడిటింగ్ ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా కూడా కేవలం ప్రాంప్ట్ తో అద్భుతమైన ఇమేజ్ లను క్రియేట్ చేయటానికి సహాయం చేస్తుంది. ఈ AI సహాయకారి అందించే ప్రాంప్ట్ తో ఎవరు ఊహించని కొత్తరకం ఇమేజ్ లను క్రియేట్ చేసి మీరు కూడా కొత్త ట్రెండ్ సెట్ చేయవచ్చు.

ChatGPT Photo Editing Prompts

ప్రస్తుతం AI ప్రపంచంలో వచ్చిన పెద్ద మార్పు ఏమిటంటే, ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఫోటో ఎడిటింగ్ చేయండం చాలా సింపుల్ అయిపోయింది. ముఖ్యంగా, ప్రముఖ AI సర్వీస్ చాట్ జిపిటి ద్వారా మీరు అద్భుతమైన ఇమేజ్ క్రియేషన్ ప్రాంప్ట్ లను అందుకోవచ్చు. అంతేకాదు, ఈ ప్రాంప్ట్ లను ఉపయోగించి అద్భుతమైన ఫోటోలు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ క్రియేట్ చేసిన ఇమేజ్ లో ఏదైనా మార్పులు చేయాలనుకుంటే కూడా చాలా ఈజీగా ఎడిట్ చేయవచ్చు. ఇమేజ్ ఎడిటింగ్ కోసం చాట్ జిపిటి గొప్ప ప్రాంప్ట్ లను అందిస్తుంది.

అసలు ఫోటో ఎడిటింగ్ ప్రాంప్ట్ అంటే ఏమిటి?

ప్రాంప్ట్ అంటే మీరు AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కి ఇచ్చే ఒక సూచన (Instruction). ఈ ప్రాంప్ట్ క్లియర్ గా ఉంటే అద్భుతమైన రిజల్ట్స్ మీకు అందుతాయి. అంటే, మనం కోరుకునే ఇమేజ్ ఎలా ఉండాలో AI కి వివరాలు ప్రాంప్ట్ ద్వారా అందిస్తే దాని ద్వారా మనం కోరుకునే అద్భుతమైన ఇమేజ్ ని క్రియేట్ లేదా ఎడిట్ చేసి తిరిగి AI మనకు అందిస్తుంది.

ఇందులో మనకు వచ్చిన లేదా తెలిసిన సింపుల్ ప్రాంప్ట్ కూడా అందించవచ్చు. అయితే, సరైన రిజల్ట్స్ కోసం సరైన ప్రాంప్ట్ ఇవ్వడం ద్వారా మరింత గొప్ప వివరాలతో కూడిన ఇమేజ్ పొందడానికి అవకాశంగా ఉంటుంది. అదే ఎడిట్ కోసం అయితే మరింత గొప్ప సహాయం అవుతుంది.

ఎందుకు ఇది ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది?

ఇందుకు తగిన కారణం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇమేజ్ ని క్రియేట్ చేయడానికి లేదా ఎడిట్ చేయడానికి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం ఉండదు. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేని ఒక బిగినర్ కూడా ప్రో లెవెల్ ఇమేజ్ లను క్రియేట్ లేదా ఎడిట్ చేయగలుగుతారు. అందుకే ఇప్పుడు ఇది గొప్ప ట్రెండ్ గా మారింది.

ఈ ఫీచర్ ద్వారా మీరు క్రియేట్ చేయదగిన లేదా మీ ఫోటో ఎడిటింగ్ కోసం కొన్ని సింపుల్ మరియు ఉదాహరణ ప్రాంప్ట్ ఇక్కడ అందిస్తున్నాము.

Cinematic Style Image Prompt:

“Turn this image into a cinematic 4K photo with golden hour lighting, realistic shadows, and depth of field”

మీరు కోరుకునే ఇమేజ్ ను అప్ లోడ్ చేసి ఈ ప్రాంప్ట్ అందిస్తే సినిమా స్టైల్ ఇమేజ్ ను మీకు ఎడిట్ చేసి అందిస్తుంది. ఇది చూడటానికి ఒక గొప్ప ప్రొఫెషనల్ ఎడిటర్ చేసినట్లు అనిపిస్తుంది.

Rain Effect Image Prompt:

“Add realistic rain, wet roads, reflections, and soft lighting to this image”

ఈ ప్రాంప్టు మీకు మంచి మూడీ ఫీల్ ఉండే రియలిస్టిక్ ఎడిటెడ్ ఇమేజ్ ను అందిస్తుంది.

Cartoon లేదా Anime Style Prompt:

“Convert this photo into anime style with vibrant colors and smooth outlines”

మీ ఫోటోలను కార్టూన్ స్టైల్ ల్దా అనిమ్ స్టైల్ ఇమేజెస్ పొందడానికి ఈ ప్రాంప్ట్ సహాయం చేస్తుంది. అంతేకాదు, మీరు అందుకున్న ఇమేజ్ లను చిన్న చిన్న సూచనల ద్వారా కోరుకునే చిన్న చిన్న మార్పులు కూడా చేసుకోవచ్చు.

Night Mode Prompt:

“Transform this image into night scene with neon lights and dark atmosphere”

ఈ ప్రాంప్ట్ తో సైబర్ పంక్ ఇమేజ్ ను అందుకోవచ్చు.

Professional Portrait Prompt:

“Enhance this portrait with sharp focus, soft skin tones, studio lighting, and blurred background”

ఈ ప్రాంప్ట్ మీ ఇమేజ్ ను అద్భుతమైన మరియు ప్రొఫెషనల్ గ్రేడ్ పోర్ట్రైట్ ఇమేజ్ గా ఎడిట్ చేసి అందిస్తుంది.

Nature Enhancement Prompt:

“Enhance colors, sky, and greenery with ultra realistic details and HDR effect”

ఇది మీరు ఇంటిలో కూర్చొని తీసుకునే సెల్ఫీ ఫోటోను కూడా ట్రావెల్ ఫోటోగ్రఫీ లుక్ లో ఎడిట్ చేసి అందిస్తుంది.

Golden Hour Portrait

“Enhance this portrait with warm golden hour lighting, soft shadows, natural skin tones, and a blurred background with sunlight glow”

ఇది మీ ఫోటో ను ఇంస్టాగ్రామ్ కోసం ఇన్స్టాంట్ ప్రీమియం ఫోటో అందిస్తుంది. ఇది సహజమైన మరియు ప్రీమియం ఫోటో ఎడిట్ చేసి అందిస్తుంది.

Winter లేదా Snow Effect Prompt

“Transform this image into a snowy winter scene with falling snow, cold blue tones, and soft fog atmosphere”

ఈ ప్రాంప్ట్ తో మీరు మీ ఇమేజ్ ను వింటర్ స్నో వైబ్ తో ఎడిట్ చేసిన ఇమేజ్ గా అందుకుంటారు.

Urban Street Photography

“Convert this image into a realistic urban street photo with neon lights, reflections, and cinematic night atmosphere”

ఇది మోడరన్ మహనగరం లుక్ అండ్ వైబ్ ఫోటో ఎడిట్ కోసం ఉపయోగపడుతుంది.

Vintage Film Look

“Apply vintage film effect with grain, faded colors, warm tones, and old camera style”

ఇది 90వ దశకంలో ప్రజల లేదా హీరోల లుక్స్ లో కనిపించడానికి ఉపయోగించే ప్రాంప్ట్. ఇది మీకు క్లాసిక్ ఫోటోగ్రఫీ ఫీల్ ఇస్తుంది.

ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా ప్రాంప్ట్ లు ఉన్నాయి. కొన్ని ఆటో ప్రాంప్ట్ లను కూడా చాట్ జిపిటి తన యూజర్ల కోసం ఆఫర్ చేస్తోంది. చాట్ జిపిటి లోకి వెళ్ళి సైడ్ లో ఉండే ‘Image’ అప్షన్ ను నొక్కగానే మీకు ఈ ఆటో ఇమేజ్ ఎడిట్ ప్రాంప్ట్ లు కనిపిస్తాయి. వీటితో మీరు మీ ఇమేజ్ ను నేరుగా ఎడిట్ చేసుకోవచ్చు.

Also Read: Dolby Atmos Soundbar ని కేవలం రూ. 6299 రూపాయల ఆఫర్ ధరలో అందుకోండి.!

బెస్ట్ రిజల్ట్ కోసం Pro Tip:

మీరు ప్రాంప్ట్ అందించే సమయంలో లేదా కొత్త ప్రాంప్ట్ రిక్వెస్ట్ చేసే సమయంలో మీరు కోరుకునే ప్రాంప్ట్ గురించి క్లుప్తంగా తెలియ చేయండి. అంటే, లైటింగ్ , కలర్, మూడ్ క్లారిటీ వంటి విషయాలు క్లియర్ గా ఇవ్వండి. అలాగే, మరింత గొప్ప ఇమేజ్ కోసం 4K, UHD, Realistic మరియు Cinematic వంటి పదాలు ఉపయోగించండి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :