Chat GPT introduced new Image Generation feature
Chat GPT : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజం OpenAI సంస్థ ఇప్పుడు AI టెక్నాలజీ అప్ డేట్ లో మరో కొత్త మైలు రాయి చేరుకుంది. ఇప్పటి వరకు టెక్స్ట్ ఇన్ఫర్మేషన్, కోడింగ్ మరియు మరిన్ని పనులు చిటికెలో చేసిన చాట్‌జిపిటి ఇమేజ్ విభాగంలో వెనుకబడిందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు వెలితిని కూడా భర్తీ చేస్తూ కొత్తగా ChatGPT Images యొక్క కొత్త వెర్షన్ ను విడుదల చేసింది. ఇది GPT Image 1.5 మోడల్ తో పని చేస్తుంది. చాట్‌జిపిటి అందించిన ఈ కొత్త ఫీచర్ 4 రేట్లు వేగంగా ఇమేజ్ లు తయారు చేయడం, ఎడిట్ చేయడం, మరియు యూజర్ ఊహలకు ప్రాణం పొసే ప్రాంప్టు ఆలోచనలతో ఊహలను విజువల్ గా మార్చడం వంటి పనులు చిటికెలో చేస్తుంది.
చాట్‌జిపిటి ఈ కొత్త ఫీచర్ ని కొత్తగా యూజర్లకు పరిచయం చేసింది. ఇది గూగుల్ జెమినీ నానో బనానా మాదిరిగా ప్రాంప్ట్ అందిస్తే గొప్ప ఫోటోలు అందించే విధంగా ఉంటుంది. అయితే, ఇందులో ముందుగా డిజైన్ చేసిన ప్రీ-సెట్ స్టైల్స్ కూడా లిస్ట్ అవుట్ చేసింది. అంటే, ఈ కొత్త ఫీచర్ ను పరిచయం చేయడమే కాకుండా, దాన్ని సులభంగా ఉపయోగించే అవకాశం కూడా అందించింది.
కొత్త అందించిన ఈ ఫీచర్ తో మీరు కోరుకునే ఇమేజ్ ను చాలా వేగంగా క్రియేట్ చేయవచ్చని చాట్‌జిపిటి తెలిపింది. జస్ట్ చాట్ బాక్స్ లో మీరు కోరుకునే ఇమేజ్ ప్రాంప్ట్ అందిస్తే మీరు కోరుకునే ఇమేజ్ వెంటనే అందుకోవచ్చు. ఒకవేళ ముందుగా అందించిన ప్రీ సెట్ ప్రాంప్ట్ తో మీరు ఇమేజ్ క్రియేట్ చేయాలనుకుంటే, జస్ట్ మీరు క్రియేట్ చేయాలనుకునే ఇమేజ్ అప్‌లోడ్ చేసి చాట్ బాక్స్ క్రింద అందించిన ప్రీ-సెట్ స్టైల్స్ ను ఎంచుకుంటే సరిపోతుంది. ఈ కొత్త మోడల్ తో ఒకేసారి మొబైల్ లేదా వెబ్ లో చిత్రాలను క్రియేట్ మరియు ఎడిట్ చేయొచ్చు.
ఈ కొత్త ఇమేజ్ జనరేషన్ 2025 ఫీచర్ ను ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం చాట్‌జిపిటి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకు వచ్చింది. API ద్వారా కూడా డెవలపర్లు దీనిని వినియోగించి బ్రాండ్ విజువల్ కంటెంట్, మార్కెటింగ్ గ్రాఫిక్స్ మరియు ఇ-కామర్స్ ప్రొడక్ట్ క్యాటలాగ్ వంటి పనులు కూడా నిర్వహించవచ్చు. ఈ కొత్త అప్‌డేట్ తో ఇప్పుడు చాట్‌జిపిటి 4 రేట్లు వేగంగా ఇమేజ్ క్రియేట్ చేస్తుందని చెబుతోంది.
Also Read: BSNL Super Offer: ఒక్క రూపాయికే 30 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి.!
కొత్త ఫీచర్ తో ఇమేజ్ క్వాలిటీ పెరుగుతుందా? అని అడిగితే, కచ్చితంగా అవును అనే చెబుతాను. ఎందుకంటే, కొత్త అప్‌డేట్ లో కూడా ముందున్న ఫోటో లైటింగ్ మరియు కంపోజిషన్ శక్తిని కొనసాగించింది మరియు మరింత మెరుగు పరిచింది. కొత్త ఫీచర్ తో క్లిష్టమైన మార్పులు (దుస్తులు, బ్యాగ్రౌండ్) వంటివి కూడా చాలా క్రమబద్ధంగా చేస్తుంది. చిన్న టెక్స్ట్ లను కూడా కోరుకున్న ఇమేజ్ లో చాలా స్పష్టంగా రెండరింగ్ చేస్తుంది.
మొత్తానికి గూగుల్ జెమినీ నానో బనానా ఫీచర్ కి గట్టి పోటీగా చాట్‌జిపిటి ఈ కొత్త ఫీచర్ జత చేసినట్లు చెప్పకుండా అర్థం అయ్యేలా చేసింది.