Union Budget 2026: రైతన్నకు AI శక్తి .. బడ్జెట్ సమావేశం నుంచి బహుళ ప్రయోజన Bharat Vistar AI అనౌన్స్ చేసిన ప్రభుత్వం.!

Updated on 01-Feb-2026
HIGHLIGHTS

దేశంలోని రైతన్న చేతికి AI శక్తి Bharat Vistar AI అందించింది

కృత్రిమ మేధ (Artificial Intelligence AI) శక్తిని ఇప్పుడు వ్యవసాయ రంగానికి అందించింది

నిర్మలా సీతారామన్‌ Union Budget 2026 నుంచి ఈ గొప్ప ప్రకటన అనౌన్స్ చేశారు

Union Budget 2026: ఈరోజు దేశానికి రైతే వెన్నెముక అనే మాటకు నిజమైన అర్ధం వచ్చేలా, దేశంలోని రైతన్న చేతికి AI శక్తి అందించింది. ఈరోజు జరిగిన 2026 యూనియన్ బడ్జెట్ సమావేశం నుంచి బహుళ ప్రయోజన Bharat Vistar AI ని దేశ ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఈ కొత్త చర్యతో ప్రపంచాన్ని ఏలుతున్న కొత్త కృత్రిమ మేధ (Artificial Intelligence AI) శక్తిని ఇప్పుడు వ్యవసాయ రంగానికి అందించింది. ఈ కొత్త చర్యతో దేశంలోని వ్యవసాయ రంగంలో మరింత విప్లవాత్మక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

Union Budget 2026: Bharat Vistar AI

యూనియన్ బడ్జెట్ 2026 సమావేశం నుంచి దేశ ఆర్థిక మంత్రి, నిర్మలా సీతారామన్‌ ఈరోజు ఈ గొప్ప ప్రకటన అనౌన్స్ చేశారు. ఈరోజు ప్రవేశపెట్టిన 2026 బడ్జెట్ నుండి కొన్ని ప్రత్యేకమైన మరియు ఆసక్తికరమైన అంశాలు వెల్లడించారు. వాటిలో బహుళ ప్రయోజనాలు (MultiPurpose) భారత్ విస్టార్ AI ని అనౌన్స్ చేసింది. AI విస్తార్ అంటే కేవలం ఆధునిక టెక్నాలజీ అభివృద్ధి మాత్రమే కాదు, AI ను ప్రతి రంగానికి, ప్రతి పౌరుడికి చేరువ చేయడం అనే గొప్ప లక్ష్యం తో రూపొందిన దృష్టికోణం.

విద్య, వ్యవసాయం, ఆరోగ్యం, పాలన, వ్యాపారం వంటి అనేక రంగాల్లో AI ఆధారిత పరిష్కారాలు అందుబాటులోకి తేవడమే దీని ప్రధాన ఉద్దేశం. మరి ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని మరింత శక్తివంతంగా మార్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. వ్యవసాయ వైవిధ్యీకరణ మరియు గ్రామీణ జీవనోపాధి మరింత బలోపేతం చేయడానికి తగిన కార్య రూపంలో వచ్చిన కొత్త మరియు ఆధునిక అంశమే భారత్ విస్టార్ AI.

దేశంలో ఉన్న అనేక భౌగోళిక స్థితి మరియు పరిస్థితి అర్ధం చేసుకుని కొత్త వ్యవసాయ పద్ధతులు అవలంబించాలి అని కూడా సీతారామన్ తెలిపారు. బడ్జెట్ 2026 సమావేశం నుంచి ప్రసంగిస్తూ, తీరప్రాంతాలలో కొబ్బరి, కోకో, గంధం మరియు జీడిపప్పు పండించడం మొదలుకొని ఈశాన్యంలో అగర్ వ్యవసాయం వరకు మరియు కొండ ప్రాంతాలలో వాల్‌నట్‌ అండ్ బాదం మరియు పైన్ గింజల వరకు అధిక విలువ కలిగిన పంటలు పెంచే లక్ష్యంలో ఆమె చొరవ గురించి కూడా వివరించారు.

Also Read: iQOO 15R పవర్ ఫుల్ ట్రిపుల్ చిప్ సెటప్ తో లాంచ్ అవుతోంది.!

Bharat Vistar AI లక్ష్యం?

భారత్ విస్టార్ AI పలు కీలక రంగాల్లో ప్రభావాన్ని చూపుతుంది. అంటే, కేవలం వ్యవసాయ రంగానికి మాత్రమే కాదు ఇది మరిన్ని ప్రాంతాల్లో కూడా ప్రభావం చూపుతుంది.

విద్య:

AI ఆధారిత పర్సనలైజ్డ్ లెర్నింగ్, స్మార్ట్ అసెస్‌మెంట్, వర్చువల్ ట్యూటర్లు ద్వారా విద్యార్థుల నేర్చుకునే సామర్థ్యాన్ని ఈ కొత్త చర్య పెంచుతుంది.

వ్యవసాయం:

పంటల అంచనా, వాతావరణ విశ్లేషణ, పురుగుల గుర్తింపు వంటి అంశాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో ఈ AI రైతులకు సహాయపడుతుంది.

ఆరోగ్యం:

ఆరోగ్య రంగంలో ముందస్తు వ్యాధి గుర్తింపు, డిజిటల్ హెల్త్ రికార్డులు, AI ఆధారిత డయాగ్నోస్టిక్స్ ద్వారా వైద్య సేవలు మరింత మెరుగుపరుస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :