BSNL సునామి అఫర్: ఈ ప్లాన్ తో డైలీ 5GB హై స్పీడ్ డేటా అందుకోండి

Updated on 15-Jan-2022
HIGHLIGHTS

BSNL ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్

5GB హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్

లాంగ్ వ్యాలిడిటీ కోరుకునేవారికి బెస్ట్ ప్లాన్

BSNL తన కస్టమర్ల కోసం డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు SMS సౌకర్యాలతో కంప్లీట్ ప్యాకేజీగా చాలానే ప్లాన్స్ అందించింది. అయితే, డైలీ అధిక డేటా మరియు లాంగ్ వ్యాలిడిటీ కోరుకునేవారికి వాటిలో ఒక బెస్ట్ ప్లాన్ వుంది. అదే, రూ.599 రూపాయలకు వచ్చే BSNL ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్. ఈ BSNL బెస్ట్ ప్లాన్ డైలీ 5GB హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటుగా లాంగ్ వ్యాలిడిటీ వంటి లాభాలను అందిస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో బిఎస్ఎన్ఎల్ కస్టమర్లకు  Zing App కి ఉచిత సబ్ స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది.

BSNL రూ.599 ప్లాన్

ఇది BSNL Rs.599 STV ప్లాన్ గా పిలువబడుతుంది. ఈ ప్లాన్ కస్టమర్లకు అధిక లాభాలను అందించే వాటిలో బెస్ట్ ప్లాన్ గా నిలుస్తుంది. ఈ ప్లాన్ 85 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను డైలీ 5GB హై సీడ్ డేతా మరియు అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ను కూడా అఫర్ చేస్తుంది. అలాగే, 85 రోజులకు డైలీ 100 ఉచిత SMS లను కూడా తీసుకువస్తుంది. అదనంగా, Zing App కి ఉచిత సబ్ స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది.

ఇక మరిన్ని బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి చూస్తే, కేవలం 500 రూపాయల కంటే తక్కువ ధరలో అన్లిమిటెడ్ ప్రయోజాలను అఫర్ చేసే బెస్ట్ ప్లాన్స్ ఇక్కడ వున్నాయి. ఆ బెస్ట్ ప్లాన్స్ ఈ క్రింద చూడవచ్చు.    

BSNL రూ.249 అన్లిమిటెడ్ ప్లాన్

BSNL యొక్క రూ.249 అన్లిమిటెడ్ ప్లాన్ డైలీ 2GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 120GB డేటాని అందిస్తుంది. అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని పూర్తిగా రెండు నెలలు మొత్తం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది మరియు రోజుకు 100 SMS లను కూడా తీసుకువస్తుంది.

BSNL రూ.397 అన్లిమిటెడ్ ప్లాన్

BSNL యొక్క రూ.397 అన్లిమిటెడ్ ప్లాన్ 10 నెలల (300 రోజులు) వ్యాలిడిటీ తో వస్తుంది మరియు డైలీ 2GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 120GB డేటాని అందిస్తుంది. అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని పూర్తిగా రెండు నెలలు మొత్తం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ యొక్క ఉచిత లాభాలు కేవలం 60 రోజులకే వర్తిస్తాయి.

BSNL యొక్క మరిన్ని బెస్ట్ ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :