రోజుకు Rs.1 కే BSNL అన్లిమిటెడ్ సర్వీస్!! BSNL బెస్ట్ ప్రీపెయిడ్ అఫర్!

Updated on 19-Apr-2021
HIGHLIGHTS

BSNL మంచి ప్రీపెయిడ్ ప్లాన్

పూర్తి సంవత్సరం వ్యాలిడిటీ

మరిన్ని ప్రయోజనాలను కూడా తీసుకొస్తుంది

రోజుకు Rs.1 కే BSNL అన్లిమిటెడ్ సర్వీస్!! BSNL బెస్ట్ ప్రీపెయిడ్ అఫర్!

BSNL  తన వినియోగదారుల కోసం ఇటీవల ఒక మంచి ప్రీపెయిడ్ ప్లాన్ ప్రకటించింది. కేవలం రోజుకు ఒక్క రూపాయి చెల్లించి పూర్తి సంవత్సరం వ్యాలిడిటీని పొందవచ్చు. చాలా తక్కువ ఖర్చుతో పూర్తి ఒక సంవత్సరం వ్యాలిడిటీ కోరుకునే కస్టమర్ల కోసం ఈ ప్లాన్ సరిగ్గా సరిపోతుంది. అదే, ఈ BSNL యొక్క 397 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ కేవలం వ్యాలిడిటీని మాత్రమే కాకుండా దీనితో మరిన్ని ప్రయోజనాలను కూడా తీసుకొస్తుంది.

BSNL యొక్క 397 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 250 నిమిషాల వాయిస్ కాల్స్, రోజుకు 2 జిబి డేటాతో పాటు రోజుకు 100 SMS  లభిస్తాయి. అయితే, ఈ వాయిస్ కాల్స్, డేటా మరియు SMS లు మాత్రం కేవలం 60 రోజులకు మాత్రమే వర్తిస్తాయి. అయితే, కస్టమర్లకు వ్యాలిడిటీ మాత్రం 365 రోజులు అంటే పూర్తిగా ఒక సంవత్సరం లభిస్తుంది. ఇక ఇటువంటి  ఎక్కువ లాభాలనిచ్చే పోస్ట్ పైడ్ ప్లాన్స్ ని కూడా ఈ క్రింద చూడవచ్చు.  

BSNL బెస్ట్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్

రూ. 199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

రూ. 199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ తో , బిఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 ఎస్‌ఎంఎస్ మరియు 300 నెట్ నిమిషాలు లభిస్తాయి .ఇది బిఎస్‌ఎన్‌ఎల్ పోస్ట్‌పెయిడ్ ఎంట్రీ లెవల్ ప్లాన్ .ఈ ప్లాన్ ప్రకారం, బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు 25 జిబి వరకు డేటాను పొందుతారు.

మరిన్ని BSNL ప్లాన్స్ కోసం ఇక్కడ నొక్కండి  

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :