డోంట్ మిస్ ది ఛాన్స్: మరో 15 రోజుల్లో క్లోజ్ కానున్న BSNL బంపర్ అఫర్..!!

Updated on 04-Apr-2022

బిఎస్ఎన్ఎల్ ఇటీవల ప్రకటించిన బంపర్ అఫర్ మరో 15 రోజుల్లో క్లోజ్ కానుంది. తన కస్టమర్లకు గొప్ప ప్రయోజనాలను అందించే విధంగా BSNL అందించిన ఈ బెస్ట్ అఫర్ మార్చ్ 31 తో ముగియనుంది. కస్టమర్లకు అదనపు వ్యాలిడిటీని అఫర్ చేసే లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్స్ ను అందించింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ యొక్క అధిక ప్రయోజనాలు ఈనెలతో 31 వ తేదీతో ముగిస్తున్నట్లు బిఎస్ఎన్ఎల్ ప్రకటించింది. ఈ ప్లాన్స్ అఫర్ ప్రయోజనాలు మరియు పూర్తి వివరాలను గురించి చూద్దాం.

BSNL రూ.2,399 ప్రీపెయిడ్ ప్లాన్

BSNL యొక్క రూ. 2399 ప్లాన్‌ ఒక సంవత్సరం చెల్లుబాటుతో అందుబాటులో ఉంది. అయితే, మార్చి 31, 2022 లోపు కనుక మీరు ఈప్లాం రీఛార్జ్ చేసుకుంటే 60 రోజుల అదనపు ఉచిత వ్యాలిడిటీని పొందుతారు. అంటే, పూర్తిగా రెండు నెలల వ్యాలిడిటీ ఫ్రీ గా అందుకోవచ్చు. BSNL యొక్క ప్లాన్ డైలీ 2GB హై స్పీడ్ డేటాని అందిస్తుంది మరియు అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని కూడా చేసుకోవచ్చు. ఈ ప్లాన్ తో డైలీ 100SMS లను మరియు ErosNow సబ్ స్క్రిప్షన్ కూడా కాంప్లిమెంటరీ గా అందిస్తుంది.

BSNL రూ.2,999 ప్రీపెయిడ్ ప్లాన్

BSNL యొక్క రూ. 2,999 ప్లాన్‌ కూడా వాస్తవానికి ఒక సంవత్సరం చెల్లుబాటుతో అందుబాటులో ఉంది. అయితే, మార్చి 31, 2022 లోపు కనుక మీరు ఈప్లాన్  రీఛార్జ్ చేసుకుంటే 90 రోజుల అదనపు ఉచిత వ్యాలిడిటీని పొందుతారు. అంటే, పూర్తిగా మూడు నెలల వ్యాలిడిటీ ఫ్రీ గా అందుకోవచ్చు. BSNL యొక్క ప్లాన్ డైలీ 3GB హై స్పీడ్ డేటాని అందిస్తుంది మరియు అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని కూడా చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ ప్లాన్ తో డైలీ 100SMS లను కూడా  అందిస్తుంది.

 BSNL బెస్ట్ ప్లాన్స్ కోసం Click Here   

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :