BSNL కస్టమర్లకు చవక ధరకే చాలా ప్రీపెయిడ్ ప్లాన్స్ అందుబాటులో వున్నాయి. అయితే, కేవలం 200 రూపాయల కంటే తక్కువ ధరకే ఎక్కువ లాభాలను అందించే ప్లాన్స్ కొన్ని మాత్రమే ఉన్నాయి. అంతేకాదు, కేవలం 200 రూపాయల కంటే తక్కువ ఖర్చుకే ఎక్కువ వ్యాలిడిటీ అఫర్ చేసే ప్లాన్స్ కలిగివున్న ఏకైక టెలికంగా సంస్థగా BSNL నిలుస్తుంది. కేవలం 200 రూపాయల కంటే తక్కువ బడ్జెట్ లో కూడా బిఎస్ఎన్ఎల్ కస్టమర్లకు మంచి ఆఫర్లే అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లకు అధిక లాబాలను అఫర్ చేస్తున్న ఆ బిఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్లాన్స్ ఏమిటో ఈరోజు చూద్దాం.
BSNL యొక్క రూ. 106 స్పెషల్ టారిఫ్ వోచర్ ఏకంగా 85 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అంతేకాదు , ఈ వ్యాలిడిటీ కాలానికి గాను 3GB హై స్పీడ్ డేటా మరియు 100 మినిట్స్ ఉచిత లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ఉచిత కాలింగ్ మినిట్స్ ను అన్ని నెటవర్క్ లకు కాలింగ్ చేయడానికి ఉపయోగించవచ్చు. ఇక ఈ 100 మినిట్స్ ఉచిత కాలింగ్ లిమిట్ ముగిసిన తరువాత కాలింగ్ కోసం నిముషానికి 30 పైసలు చెల్లించాలి. అధనంగా, ఈ ప్లాన్ ద్వారా 60 రోజుల పాటు కాలర్ ట్యూన్ సర్వీస్ ను ఉచితంగా పొందవచ్చు.
BSNL యొక్క రూ.197 రీఛార్జ్ ప్లాన్ 150 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అంతేకాదు, డైలీ 2GB హై స్పీడ్ డేటా, అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100SMS లాభాన్ని కూడా ఉచితంగా అందిస్తుంది. అయితే, ఈ ఉచిత ప్రయోజానాలన్ని కూడా కేవలం 18 రోజులకు మాత్రమే వర్తిస్తాయి. కానీ వ్యాలీడీటీ మాత్రం 150 రోజులకు వర్తిస్తుంది. అంటే, BSNL కస్టమర్లు కేవలం 200 రూపాయల కంటే తక్కవ ఖర్చుతోనే 5 నెలల వ్యాలిడిటీని పొందవచ్చు.
మరిన్ని BSNL ప్లాన్స్ మరియు రీఛార్జ్ కోసం Click Here