BSNL సునామి అఫర్: Rs.397 రూపాయలకే 10 నెలల అన్లిమిటెడ్ సర్వీస్

Updated on 13-Dec-2021
HIGHLIGHTS

తక్కువ ధరకే తన సర్వీస్ లను అఫర్ చేస్తున్న టెలికం సంస్థగా BSNL

తక్కువ ధరకే తన కస్టమర్లకు బెస్ట్ అఫర్లను ఇస్తోంది

రోజుకు ఒక్క రూపాయి ఖర్చుతోనే అన్లిమిటెడ్ సర్వీస్

ప్రస్తుతం అందరికంటే తక్కువ ధరకే తన సర్వీస్ లను అఫర్ చేస్తున్న టెలికం సంస్థగా BSNL నిలిచింది. ఇప్పటి వరకూ టెలికం రంగంలో కొనసాగిన భీకరమైన పోటీ గత నెల నుండి పెరిగిన రీఛార్జ్ ధరల తరువాత ఒక్కసారిగా స్థబ్దుగా మారింది. అయితే, BSNL మాత్రం పాత రేట్లనే  కొనసాగిస్తూ తక్కువ ధరకే తన కస్టమర్లకు బెస్ట్ అఫర్లను ఇస్తోంది.

వాటిలో బెస్ట్ అఫర్ అంటే, రూ.397 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు.  ఎందుకంటే, ఈ అఫర్ తో BSNL కస్టమర్లకు కేవలం 397 రూపాయలకే  పూర్తి 300 రోజుల వ్యాలిడిటీని అఫర్ చేస్తుంది.ఈ ప్లాన్ బడ్జెట్ ధరలో బెస్ట్ ప్లాన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమౌంట్ ని రోజుల లెక్కన లెక్కగడితే, రోజుకు కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఖర్చవుతుంది.

ఈ అఫర్ ముందు నుండే  అందుబాటులో వుంది మరియు BSNL బెస్ట్ ప్రీపెయిడ్ ఆఫర్లలో ఒకటిగా చెప్పబడుతోంది. ఈ ప్లాన్ తో మరిన్ని ఉచిత ప్రయోజనాలు కూడా ఉన్నాయి. BSNL యొక్క ఈ 397 రూపాయల ప్రీపెయిడ్ అఫర్ రీఛార్జ్ చేసే వారికీ పూర్తిగా 300 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అంతేకాదు, కస్టమర్లకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2 జిబి డేటాతో పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.

అయితే, ఈ అన్లిమిటెడ్ కాలింగ్, ఉచిత SMS  మరియు డేటా లిమిటెడ్ డేస్ కోసం మాత్రమే. ఈ రీఛార్జ్ చేసే కస్టమర్లకు వ్యాలిడిటీ 365 రోజులు అంటే ఒక సంవత్సరం లభించినా, ఉచిత కాలింగ్, డేటా మరియు SMS సర్వీస్ లు మాత్రం కేవలం 60 రోజులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. 

మరిన్ని BSNL ప్లాన్స్ కోసం ఇక్కడ నొక్కండి       

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :