ఇటీవల,boAt చవక ధరకే DOLBY ATMOS 3D సౌండ్‌బార్ లాంచ్ చేసింది. ఈ DOLBY ATMOS 3D సౌండ్‌బార్ boAt అధికారిక వెబ్సైట్ నుండి సేల్ కోసం అందుబాటులోకి తెచ్చింది. త్వరలోనే, ఫ్లిప్‌కార్ట్ లో కూడా సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ boAt డాల్బీ అట్మాస్ సౌండ్‌బార్ AAVANTE Bar 4000DA మోడల్ నంబర్ తో ఉంటుంది. ఈ సౌండ్‌బార్ మైన్ యూనిట్ లో 6 స్పీకర్లు మరియు 1 పెద్ద సెపరేట్ ఉఫర్ తో వస్తుంది మరియు 200W RMS హెవీ సౌండ్ అందిస్తుంది.
boAt యొక్క ఈ Dolby Atmos 3D సౌండ్ బార్ కేవలం రూ.14,999 రుపాయల ధరతో లాంచ్ చెయ్యబడింది.
BoAt AAVANTE Bar 4000DA స్పెషిఫికేషన్ల విషయానికి వస్తే, ఇది 2.1.2 సౌండ్ బార్. ఈ సౌండ్ బార్ మైన్ యూనిట్ లో నాలుగు 2.24 ఇంచ్ స్పీకర్లు, రెండు 2 ఇంచి స్పీకర్లు వున్నాయి. ఇక సబ్ ఉఫర్ పెద్ద 6.5 ఇంచ్ ఉఫర్ ని కలిగి ఉంటుంది. మొత్తంగా, ఈ AAVANTE Bar 4000DA సౌండ్ బార్ సౌండ్ 7 స్పీకర్లను కలిగి ఉంటుంది మరియు టోటల్ గా 200W RMS పవర్ ఫుల్ సౌండ్ ని అందిస్తుంది.
ఈ boAt సౌండ్ బార్ కనెక్టివిటీ పరంగా కూడా మంచి అప్షన్ లతో వస్తుంది. ఈ సౌండ్ బార్, HDMI ARC, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ 5.0 వంటి కనెక్టివిటీ అప్షన్లతో వస్తుంది. అయితే, మీ సెటప్ బాక్స్ లేదా మీడియా ప్లేయర్ లేదా Dongel తో నేరుగా కనెక్షన్ కోసం Pass-Through కనెక్టివిటీ ను కూడా కలిగి వుంది.