పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ న్యూస్. పవర్ స్టార్ లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ 'భీమ్లా నాయక్' ను అనుకున్న తేది కంటే ఒకరోజు ముందుగానే OTT ప్లాట్ ఫామ్ లో విడుదల చేశారు. భీమ్లా నాయక్ ను మార్చి 25 న డిస్నీ+ హాట్ స్టార్ మరియు ఆహా లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ సినిమాను డిస్నీ+ హాట్ స్టార్ మరియు ఆహా రెండు OTT ప్లాట్ ఫామ్స్ పైన మార్చి 24 నుండే, అంటే ఈరోజు నుండే స్ట్రీమింగ్ చేస్తున్నారు.
భీమ్లా నాయక్ మూవీ థియేటర్స్ లో భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమా ఇప్పటికీ కొన్ని థియేటర్స్ లో ప్రదర్శించడుతోంది. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్షన్ ఈ సినిమాలో ఒకరేంజ్ లో ఉండడమే కాకుండా రాణా దగ్గుబాటి యాక్షన్ కూడా సూపర్. విడుదలకు ముందు నుండే ఈ సినిమా భారీ అంచనాలను మరియు క్రేజ్ ను సంపాదించుకున్నఈ చిత్రం, సినిమా థియేటర్లలో కూడా మంచి విజయాన్ని సాధించింది.
The Power Storm is here!!