పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ యాక్షన్ మూవీ భీమ్లా నాయక్ ఎప్పుడెప్పుడు OTT లో వస్తుందా? అని ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. భీమ్లా నాయక్ సినిమా OTT రిలీజ్ డేట్ వచ్చేసింది. థియేటర్లలో భారీ వసూళ్లను సాధించిన భీమ్లా నాయక్ OTT లో డిజిటల్ హక్కుల కోసం కూడా బాగానే వసూలు చేసింది. ఈ సినిమా AHA మరియు Disney+ Hotstar ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పైన మార్చి 25 న రిలీజ్ అవుతోంది.
https://twitter.com/DisneyPlusHSTel/status/1504528693430939650?ref_src=twsrc%5Etfw
విడుదలకు ముందునుండే భారీ అంచనాలను మరియు క్రేజ్ ను సంపాదించుకున్నఈ చిత్రం, సినిమా థియేటర్లలో కూడా మంచి విజయాన్ని సాధించింది. పవన్ కళ్యాణ్ మరియు దగ్గుబాటి రాణా హీరోలుగా నటించిన ఈ భారీ మల్టి స్టార్ సినిమా ఇప్పుడు OTT లో కూడా సందడి చెయ్యబోతోంది.
ఇప్పటికే Disney+ Hotstar అధికారిక ట్విట్టర్, యూట్యూబ్ మరియు ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా OTT రిలీజ్ డేట్ తో ట్రైలర్ ను కూడా ట్వీట్ చేసింది. ఇక AHA యాప్ లో బ్యానర్ ద్వారా రిలీజ్ డేట్ టీజర్ అందించింది. ఈ సినిమా ఎప్పుడు OTT లో వస్తుందా అని ఎదురు చూస్తున్న వారికీ ఇది నిజంగా శుభవార్తే. మార్చి 25 న అంటే, ఖచ్చితంగా వచ్చే శుక్రవారం OTT లో ప్రసారం అవుతుంది.