బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ఒకే నెలలో 25 లక్షల అకౌంట్స్ బ్యాన్ చేసింది

Updated on 17-Nov-2021
HIGHLIGHTS

BGMI 25 లక్షలకు పైగా అకౌంట్స్ పైన శాశ్వతంగా బ్యాన్ విధించింది

706,319 అకౌంట్స్ ను తాత్కాలికంగా నిషేధించినట్లు కూడా పేర్కొన్నారు

ఆన్లైన్ గేమింగ్ లో హ్యాకర్స్ మరియు ఛీటర్లు ఎక్కువగా చెలరేగుతున్నారు

ఆన్లైన్ గేమింగ్ లో హ్యాకర్స్ మరియు ఛీటర్లు ఎక్కువగా చెలరేగుతున్నారు. గేమర్స్ కు ప్రీతీపాత్రమైన బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) కూడా అందుకు మినహాయింపు కాదు. అయితే, బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా మాత్రం హ్యాకర్స్ మరియు చీటర్లకు ఈ గేమ్ లో స్థానం లేదంటూ హ్యాకింగ్ మరియు గేమ్ చీటింగ్ కు పాల్పిడినట్లు తేలిన 25 లక్షలకు పైగా అకౌంట్స్ పైన శాశ్వతంగా బ్యాన్ విధించింది.

సెప్టెంబర్ 30 న చివరి ప్రకటన చేసిన తరువాత కూడా చాలా మంది గేమర్స్ తమ గేమింగ్ సమయంలో హ్యాకర్స్ మరియు ఛీటర్స్ భారిన పడినట్లు BGMI గుర్తించింది. గేమ్‌ప్లే వాతావరణాన్ని అందించడానికి మరియు సరైన గేమింగ్ అందించడానికి గేమ్ నుండి మోసగాళ్లను తొలగించడానికి తీవ్రమైన చర్యలు BGMI ప్రకటించింది మరియు అక్టోబర్ 1 మరియు నవంబర్ 10 మధ్య కాలంలో 2,519,692 అకౌంట్స్ ను శాశ్వతంగా తొలగించినట్లు బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా వివరించింది.

ఇది మాత్రమే కాదు, డెవలపర్లు అదే సమయంలో 706,319 అకౌంట్స్ ను తాత్కాలికంగా నిషేధించినట్లు కూడా పేర్కొన్నారు. అంతేకాదు, గేమింగ్ లో మోసాన్ని అరికట్టడానికి krafton నాలుగు చెర్యలను తీసుకున్నట్లు మరియు రానున్నరోజుల్లో వాటిని రెట్టింపు చేస్తుందని కూడా పేర్కొంది. డెవలపర్‌లు ఇప్పుడు రియల్ టైంలో హై-ర్యాంకర్‌ల వారి ర్యాంకింగ్ కోసం చట్టవిరుద్ధ ప్రోగ్రామ్‌లను ఉపయోగించారా లేదా అని ఏదైనా అకౌంట్ ను మాన్యువల్‌గా ధృవీకరిస్తారు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :