మీ ఫోన్ Battery Life రెట్టింపు చేయాలంటే ఇలా చేయండి.!

Updated on 13-Nov-2025
HIGHLIGHTS

స్మార్ట్ ఫోన్ లో ఫోన్ బ్యాటరీ ప్రధాన అవయవం అవుతుంది

బ్యాటరీ ఎక్కువ కాలం నడవకపోతే మీరు మీ ఫోన్ డెడ్ అవుతుంది

చిన్న చిన్న టిప్స్ తో మీ Battery Life ను రెట్టింపు చేసే అవకాశం ఉంది

స్మార్ట్ ఫోన్ లేనిదే క్షణం క్షణం గడవని రోజులు వచ్చాయి. కాలింగ్, చాటింగ్ మొదలుకొని ఎంటర్టైన్మెంట్ వరకు ప్రతి దానికి ఇప్పుడు స్మార్ట్ ఫోన్ మాత్రమే నిజమైన నేస్తం అనేస్తున్నారు యువత. అటువంటి స్మార్ట్ ఫోన్ లో ఫోన్ బ్యాటరీ ప్రధాన అవయవం అవుతుంది. అటువంటి బ్యాటరీ ఎక్కువ కాలం నడవకపోతే మీరు మీ ఫోన్ డెడ్ అవుతుంది. కానీ, చిన్న చిన్న టిప్స్ తో మీ Battery Life ను రెట్టింపు చేసే అవకాశం ఉంది. మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ రెట్టింపు చేసే ఆ బెస్ట్ టిప్స్ ఈరోజు తెలుసుకుందామా.

Battery Life బెస్ట్ టిప్స్

స్క్రీన్ బ్రైట్నెస్ తగ్గించండి

ఈ ఫోన్ బ్యాటరీని డ్రైన్ చేయడంలో మీ ఫోన్ స్క్రీన్ బ్రైట్నెస్ ప్రధాన పాత్ర వహిస్తుంది. మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ పెంచడానికి మీ ఫోన్ లో ఆటో బ్రైట్నెస్ లేదా అడాప్టివ్ బ్రైట్నెస్ ఫీచర్ ని ఆన్ చేయండి. ఇది మాత్రమే కాదు డార్క్ మోడ్ ని ఉపయోగించడం కూడా మీ ఫోన్ బ్యాటరీ సేవ్ చేసే బెస్ట్ టిప్ గా ఉంటుంది.

బ్యాక్‌గ్రౌండ్‌ యాప్స్ క్లోజ్ చేయండి

మీ ఫోన్ లో చాలా యాప్‌లు మీరు వాడకపోయినా బ్యాక్‌గ్రౌండ్‌ లో రన్ అవుతుంటాయి. అటువంటి యాప్స్ ని గుర్తించి ఆ యాప్స్ ని ఆఫ్ చేయండి. దీనికోసం మీ ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి బ్యాటరీ ట్యాబ్ ఎంచుకొని వాటిలో బ్యాక్‌గ్రౌండ్‌ లో రన్ అవుతున్న అవసరం ల్ని యాప్స్ ని స్టాప్ చేయండి. అంతేకాదు, ఇదే ట్యాబ్ లో ఉండే పవర్ సేవింగ్ మోడ్ ఎనేబుల్ చేయండి. ఆండ్రాయిడ్ 13, 14 15 OS లో వచ్చిన కొత్త ఫీచర్ అడాప్టివ్ బ్యాటరీ ని ఎంచుకోవడం చాలా ఉపయోగకరం అవుతుంది. ఈ టిప్స్ తో మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ మరింత పెరుగుతుంది.

ఒరిజినల్ ఛార్జ్ మాత్రమే వాడండి

మీ ఫోన్ కోసం కంపెనీ నిర్ణయించిన ఒరిజినల్ చార్జర్ మాత్రమే ఉపయోగించండి. మార్కెట్ లో దొరికే నాసిరకం ఛార్జర్ వాడకం మీ ఫోన్ మరియు మీ ఫోన్ బ్యాటరీ కి సైతం హానికరం. ఇవి మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ నాశనం చేస్తాయి. అంతేకాదు, మీ ఫోన్ 100% బ్యాటరీ అవ్వగానే చార్జర్ ని తొలగించండి.

Wi-Fi, Bluetooth, GPS ఆఫ్ చేయండి

సాదరంగా బ్లూటూత్ హెడ్ యూజ్ చేసే వారు ఎల్లపుడూ బ్లూటూత్ ఫీచర్ ని ఆన్ చేసి ఉంచుతారు. కానీ, ఇది మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువ డ్రైన్ చేస్తుంది. అందుకే, మీరు బ్లూటూత్ హెడ్ ఫోన్ ల్దా బి వుడ్స్ యూజ్ చేయని సమయంలో ఆఫ్ చేయండి. అలాగే, అవసరం లేని సమయంలో Wi-Fi మరియు GPS ఫీచర్ లను కూడా ఆఫ్ చేయండి.

రెగ్యులర్ సాఫ్ట్ వేర్ అప్డేట్

మీ ఫోన్ లో రెగ్యులర్ గా సాఫ్ట్ వేర్ అప్డేట్ చేయండి. కంపెనీ అందించే కొత్త సాఫ్ట్ వేర్ అప్డేట్స్ తో బ్యాటరీ మేనేజ్‌మెంట్ మరింత మెరుగ్గా ఉంటుంది. అంతేకాదు, మీ ఫోన్ మరింత నూతనంగా మరియు ఫాస్ట్ గా కూడా ఉంటుంది.

లైవ్ వాల్ పేపర్స్ మరియు విడ్జెట్‌లు తగ్గించండి

మీ ఫోన్ లో లైవ్ వాల్ పేపర్స్ మరియు విడ్జెట్‌ల వాడకం తగ్గించండి. ఇవి మీ ఫోన్ బ్యాటరీని వేగంగా డ్రైన్ చేయడంలో ముఖ్యపాత్ర వహిస్తాయి. సాధారణ వాల్ పేపర్ మరియు అవసరమైన విడ్జెట్‌లు మాత్రమే ఉపయోగించండి.

Also Read: ఆల్ టైమ్ డౌన్ ధరలో సేల్ అవుతున్న బ్రాండెడ్ Dolby Soundbar

ఉపయోగకరమైన టిప్స్

మీరు ఫోన్ ను ఛార్జ్ చేసే సమయంలో ఫోన్ ను ఉపయోగించడం మానేయండి. ఇది మీ ఫోన్ బ్యాటరీని వేడెక్కేలా చేస్తుంది. ఇలా ఫోన్ బ్యాటరీ ఎక్కువగా హీట్ అవ్వడం ద్వారా బ్యాటరీ కెమికల్ లైఫ్ తగ్గుతుంది.

ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది మరియు మీరు మాటి మాటికీ మీ ఫోన్ ను ఛార్జ్ చేసే అవసరం తగ్గుతుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :