best Ramadan Mubarak quotations and images to send your friends and loved one
Ramadan Mubarak: తమను తాము శుద్ధి చేసుకొని అల్లాహ్ వారికి దగ్గరవడానికి ప్రతీకగా జరుపుకునే పండుగే రంజాన్ పండుగ. ఈ పండుగ ఇస్లామిక్ క్యాలెండర్ లో 9వ నెల అవుతుంది మరియు ఈ నెలను ఉపవాస నెలగా కూడా పిలుస్తారు. ఈ నెల రోజులు ఉదయం నుంచి సాయంత్రం వరకు మంచి నీరు సైతం త్యాగం చేసి కఠినమైన ఉపవాసం చేస్తారు. నెల గడిచిన తర్వాత నెల వంకను రాకతో రంజాన్ మాసం ముగుస్తుంది మరియు నెలపొడుపు కనిపించిన తర్వాత రంజాన్ పండుగను జరుపుకుంటారు. అటువంటి, పరమ పవిత్రమైన రంజాన్ పండుగ జరుపుకుంటున్న మీ స్నేహితులు మరియు ప్రియమైన వారికి శుభాకాంక్షలు తెలియజేసే బెస్ట్ కొటేషన్లు మరియు ఇమేజ్ లను అందిస్తున్నాము.
అల్లాహ్ మీకు ఆరోగ్యం, ధనం, మరియు విజయాన్ని ప్రసాదించుగాక, రంజాన్ శుభాకాంక్షలు!
ఆ అల్లాహ్ యొక్క కరుణ మీపై ఎల్లప్పుడూ వర్షించుగాక, రంజాన్ శుభాకాంక్షలు!
మీ ప్రార్థన ఆ అల్లాహ్ సన్నిధికి చేరాలని కోరుకుంటూ మీకు రంజాన్ శుభాకాంక్షలు!
అల్లాహ్ కరుణ మీ కుటుంబం పై ఎల్లప్పుడూ ఉండుగాక, రంజాన్ ఈద్ ముబారక్!
ఈ పవిత్ర రంజాన్ పండుగ రోజున మీ కుటుంబానికి ఆరోగ్యం, సంపద, మరియు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. రంజాన్ శుభాకాంక్షలు!