best 1.5 Ton Split AC deal under rs 30000 today available
2025 సమ్మర్ తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఇప్పటికే భానుడి ప్రతాపానికి బయట తిరగలేని పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు, వేడిగాలులకు ఇంట్లో కూడా వేడి ప్రభావానికి లోనయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎండవేడిమి నుంచి మీ ఇంటిల్లపాది చల్లని వాతావరణంలో నిలవాలంటే మంచి ఏసీ కలిగి ఉండాలి. మీరు కూడా ఇదే ఆలోచిస్తూ మీ ఇంటికి తగిన మంచి 1.5 Ton Split AC కోసం సెర్చ్ చేస్తుంటే, ఈరోజు లభిస్తున్న ఈ బెస్ట్ ఏసీ డీల్ ను పరిశీలించవచ్చు.
Haier ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన 1.5 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఏసీ మోడల్ నెంబర్ HSU17VP-TQS3BN-INV ఈరోజు లభిస్తున్న బెస్ట్ డీల్ గా నిలుస్తుంది. ఈ ఏసీ పై అమెజాన్ ఇండియా అందించిన ఆఫర్స్ కారణంగా ఈ ఏసీ బెస్ట్ ఏసీ గా నిలుస్తుంది. ఈ ఏసీ ఈరోజు అమెజాన్ నుంచి 505 డిస్కౌంట్ అందుకుని రూ. 34,990 ఆఫర్ ధరకు లభిస్తుంది.
ఈ ఏసీ ని మరింత చవక ధరకు అందుకునేలా మరో రెండు బెస్ట్ డీల్స్ కూడా అందించింది. అవేమిటంటే, ఈ ఏసీ పై రూ. 1,000 కూపన్ డిస్కౌంట్ మరియు HDFC డెబిట్ కార్డు 12 నెలల EMI పై రూ. 2,500 అదనపు డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ ఏసీ కేవలం రూ. 31,490 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. Buy From Here
Also Read: Motorola Edge 60 stylus: బడ్జెట్ స్టైలస్ పెన్ ఫోన్ లాంచ్ ప్రకటించిన మోటోరోలా.!
ఈ హేయర్ 1.5 టన్ ఏసి 7 ఇన్ 1 కన్వర్టబుల్ మోడ్ ఫీచర్ తో వస్తుంది. ఈ ఏసీ హైపర్ స్ట్రాంగ్ PCB లాంగ్, 100% కాపర్ కాయిల్ మరియు ఎయిర్ ఫ్లో బ్లోవర్ ను కలిగి ఉంటుంది. ఈ ఏసీ 54 డిగ్రీల తీవ్రమైన వేడి వాతావరణంలో కూడా పని చేస్తుందని హేయర్ తెలిపింది. ఈ హేయర్ స్ప్లిట్ ఏసీ ట్విన్ ఇన్వెర్టర్ టెక్నాలజీ కూడా కలిగి ఉంటుంది.
ఈ హేయర్ ఏసీ సూపర్ యాంటీ కోరిసన్ సెటప్ తో వస్తుంది. అంతేకాదు, సెల్ఫ్ క్లీన్ ఫీచర్ తో కూడా వస్తుంది. ఈ ఏసీ సూపర్ మైక్రో బ్యాక్తీరియల్ ఫిల్టర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఏసీ 2 వే ఎయిర్ స్వింగ్, హిడెన్ డిస్ప్లే, లో గ్యాస్ వార్ణింగ్ మరియు సూపర్ సైలెంట్ మోడ్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది.
హేయర్ ఈ ఏసీ పై 5 సంవత్సరాల (1+4 Years) వారంటీ మరియు కంప్రెసర్ పై ఏకంగా 12 సంవత్సరాల వారంటీ కూడా కలిగి ఉంటుంది. ఈ ఏసీ ఈరోజు అమెజాన్ నుంచి 30 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది.