BattleGrounds Mobile India: జూన్ లో లాంచ్ పక్కా..!

Updated on 28-May-2021
HIGHLIGHTS

BattleGrounds Mobile India అభిమానులకు శుభవార్త

ఈ గేమ్ యొక్క కొత్త న్యూస్ బయటికి వచ్చింది

జూన్ మూడవ వారంలో ఈ గేమ్ అధికారికంగా లాంచ్ అవుతుందని హింట్

BattleGrounds Mobile India గేమ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త. ఇప్పుడు ఈ గేమ్ యొక్క కొత్త న్యూస్ బయటికి వచ్చింది. కొత్త న్యూస్ ప్రకారం, బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా జూన్ 13 నుండి 19 తేది మధ్య కాలంలో ఇండియాలో లాంచ్ అవుతుందని పక్కాగా చెబుతన్నారు. ప్రముఖ Esport అథ్లెట్ అభిజిత్ ఘటక్ అందేర్, జూన్ మూడవ వారంలో ఈ గేమ్ అధికారికంగా లాంచ్ అవుతుందని హింట్ ఇచ్చారు.

వాస్తవానికి, మే 18 న Google Play నుండి ప్రీ రిజిస్ట్రేషన్ కోసం BattleGrounds Mobile India లిస్టింగ్ చెయ్యబడింది. అయితే, ఇప్పటి వరకూ కూడా దీని లాంచ్ డేట్ విషయంలో అధికారికంగా ఎటువంటి డేట్ ను కూడా ప్రకటించ లేదు. కానీఅభిజిత్ ప్రకారం, జూన్ మూడవ వారంలో 13  నుండి 19 వ తేదీ మధ్యలో ఈ గేమ్ ను లాంచ్ చేయవచ్చని తెలుస్తోంది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ నుండి చేసిన ట్వీట్ ద్వారా తెలిపారు.

అయితే, BattleGrounds Mobile India గేమ్ ను ఇండియాలో లాంచ్ చెయ్యవద్దని కొంత నిరసనలు వ్యక్త మయ్యాయి. ప్రధాన మంత్రికి ఈ విషయం మీద అర్జీలను కూడా కొంత మంది నాయకులే సమర్పించడం గమనార్హం. అయితే, ఈ గేమ్ ను బాగా ఇష్టపడే గేమింగ్ ప్రియులు మాత్రం ఈ గేమ్ వస్తే బాగుండు అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ గేమ్ లాంచ్ నాటికీ చూడాలి యామి జరుగుతోందో.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :