ఇక ముట్టుకోకుండానే క్యాష్….Cardless ATM మిషన్లను స్థాపించనున్న బ్యాంకులు

Updated on 07-Jun-2020
HIGHLIGHTS

అకౌంట్ నుండి డబ్బు విత్ డ్రా చేయ్యాలంటే, బ్యాంక్ లేదా ATM లను ఆశ్రయించాల్సిందే.

ప్రస్తుత కరోనా ప్రభావంతో ప్రజలు ATM లను సందర్శించడం పూర్తిగా తగ్గించారు.

బ్యాంకులు ముట్టుకునే అవసరం లేకుండా పనిచేసే ContactLess ATMs ను తీసుకురావడానికి సిద్దమువుతున్నాయి..

ప్రపంచ వ్యాప్తంగా, కరోనా భారిన పడకుండా తీసుకోదగిన జాగ్రత్తల గురించి అన్ని దేశాలు కూడా చెబుతున్న మాట ఒక్కటే… సామజిక దూరం. అంటే, ఒకరికి ఒకరికి మధ్య సురక్షితమైన దూరాన్ని పాటించడం. ఈ మహమ్మారి ఎప్పుడు ఎవరిని కబళిస్తోంది తెలియని పరిస్థితిలు నెలకొన్న పరిస్థితుల్లో వారి అకౌంట్ నుండి డబ్బు విత్ డ్రా చేయ్యాలంటే, బ్యాంక్ లేదా ATM లను ఆశ్రయించాల్సిందే. అయితే, సౌలభ్యం కారణంగా మనము ఎక్కువగా ATM మిషన్లను ఆశ్రయిస్తాము. కానీ, ప్రస్తుత కరోనా ప్రభావంతో ప్రజలు ATM లను సందర్శించడం పూర్తిగా తగ్గించారు. ఇందుకు కారణం, ATM లను ఎప్పుడు శుభ్రం చేస్తారో తేలికపోవడం, ఒకరు ముట్టుకున్న ATM మిషన్నే మరొకరు ముట్టుకోవాల్సి రావడం వంటివి. 

కానీ, ఇప్పుడు బ్యాంకులు ఒక మంచి విషయాన్ని ప్రకటించాయి. అదే, ముట్టుకుపోకుండా పనిచేసే ContactLess ATM మిషన్లు. ఈ విషయాన్ని ముందుగా TOI ప్రచురించింది. దీని ప్రకారం, బ్యాంకులు ముట్టుకునే అవసరం లేకుండా పనిచేసే ContactLess ATMs ను తీసుకురావడానికి పనిచేస్తునట్లు తెలిపింది. కొత్తగా తీసుకురానున్నఈ ATM లు, వినియోగదారులు వారి మొబైల్ యాప్ నుండి QR Code స్కాన్ చేయ్యడం ద్వారా డబ్బును విత్ డ్రా చేసేలా ఉంటాయి. ATM మిషన్ల పైన పనిచేసే AGS Transact Technologies అనే సంస్థ, ఈ కొత్త రకం ContactLess ATM లను రూపొందించింది.

ఈ ATM ద్వారా నగదును తీసుకోవడం సురక్షితం మరియు ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న కార్డు క్లోనింగ్ (Card Cloning) వంటి అపాయాల నుండి కూడా తప్పించుకునే వీలుంటుందని మరియు ఈ ATM నుండి కేవలం 25 సెకన్లలో క్యాష్ ని విత్ డ్రా చెయ్యవచ్చని, AGS Transact Technologies సంస్థ యొక్క CTO (చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్) తెలిపారు.                                        

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :