Coronavirus map పేరుతొ మాల్వేర్ వచ్చింది

Updated on 20-Mar-2020
HIGHLIGHTS

ఇది వినియోగదారుల సోషల్ మీడియా అకౌంట్ల పైన కూడా ప్రభావం చూపిస్తుందని కూడా తెలిపారు.

చైనాలో మొదలయ్యి ప్రపంచ వ్యాప్తంగా అందరిని వణికిస్తున్న కరోనా వైరస్ లేదా COVID-19, ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా 'మహమ్మారి' గా ప్రకటించబడింది. ఇది ప్రపంచవ్యప్తంగా అందరిని భయబ్రాంతులకు గురిచేస్తుండగా, అన్ని దేశాల ప్రభుత్వాలు తమ ప్రజలను దాని భారిన పడకుండా చూసేందుకు తగిన అన్ని చర్యలను తీసుకుంటున్నాయి. అయితే, ప్రస్తుతం ఆన్లైన్లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్న కరోనా వైరస్ లేదా COVID-19 ను పేరును ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు మాల్వేర్ లను పంపుతున్నారు.

'Reason Labs' సైబర్ సెక్యూరిటీ రీసెర్చెర్, Shai Alfasi ఆన్లైన్లో 'Coronavirus map' అనే పేరుతొ వుండే అప్లికేషన్, వినియోగదారుల సున్నతమైన డేటాని తస్కరిస్తునట్లు కనుగొన్నారు. ఇది వినియోగదారుల యొక్క బ్రౌజర్ నుండి యూజర్ నేమ్స్, పాస్వర్డులు, క్రెడిట్ కార్డు నెంబర్లు మరియు ఇటువంటి మరిన్ని సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తుంది. ఇది వినియోగదారుల సోషల్ మీడియా అకౌంట్ల పైన కూడా ప్రభావం చూపిస్తుందని కూడా తెలిపారు.

CoronoaVirus MAP మీకు ఈ విధంగా కనిపిస్తుంది  

ఈ కొత్త మాల్వేర్ ఎలా పనిచేస్తుందో కూడా 'Shai Alfasi'  రీజన్ బ్లాగు లో వివరించారు. ఇధి 2016 లో కనుగొనబడి ప్రస్తుతం అందరికి తెలిసిన AZORult అనే మాలిక్యులస్ సాఫ్ట్ వేర్ ని చైతన్యవంతం చేస్తుంది. తద్వారా ఇది బ్రౌజింగ్ హిస్టరీ, Cookies, ID/ పాస్వర్డ్, క్రిప్టోకరెన్సీ మరియు మరిన్ని సోర్సులా ద్వారా వినియోగదారు వివరాలను సేకరిస్తుంది(తస్కరిస్తుంది). అంతేకాదు, ఇది దానికి అనుకూలమైన మరిన్నిమాల్వేర్ లను కూడా తనంతట తానుగా డౌన్లోడ్ చేసుకుంటుందని పేర్కొన్నారు.

ఇక దీని GUI చూసేవారికి వారికీ మాత్రం ఎటువంటి అనుమానం రాదు. ఎందుకంటే, ఈ మ్యాప్ చుడానికి మరియు ఆడాయి అందించే వివరాలు అన్ని కూడా మీకు సహజంగా మరియు చూడగానే ఆకట్టుకునేలా ఉండడమే ఇందుకు కారణం. కాబట్టి, ఆన్లైన్లో సెర్చ్ చేసేప్పుడు నమ్మకమైన మరియు అధికారిక వెబ్ సైట్స్ ద్వారా మాత్రమే మీరు కరోనా వైరస్ లేదా COVID-19 యొక్క సమాచారం కోసం చెక్ చెయ్యడం మంచిది.                                                               

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :