Android 12: లీకైన ఆండ్రాయిడ్ 12 ఫీచర్స్..ఎలా ఉన్నాయంటే..!

Updated on 09-Feb-2021
HIGHLIGHTS

Android 12 యొక్క కొన్ని ఫీచర్ల లీక్

ఆండ్రాయిడ్ 12 గురించి వివరిస్తున్న లీక్స్

డిజైన్, ప్రైవసీ మరియు మరికొన్ని ఫీచర్లు

సెప్టెంబర్ 2020 లో వచ్చిన ఆండ్రాయిడ్ 11 యొక్క అప్డేట్ ఇప్పటికీ ఇంకా చాలా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు అందలేదు. కానీ, ఇప్పుడు నెట్టింట్లో హల చల్ చేస్తున్న ఒక లీక్ Android 12 యొక్క కొన్ని ఫీచర్ల గురించి ముందగానే ఒక అవగాహన కలిపిస్తోంది. ఈ సంవత్సరం చివరిలో ప్రధాన స్మార్ట్ ఫోన్లకు చేరుకునే వీలుందని భావిస్తున్న Android 12 యొక్క ప్రధాన ఫీచర్లయినటువంటి, డిజైన్, ప్రైవసీ మరియు మరికొన్ని ఫీచర్లు తెల ఉండనున్నాయో ఈ లీక్ సూచింది.

XDA డెవలపర్ ముందుగా అందించిన నివేదిక ప్రకారం, గూగుల్ తన తరువాతి ప్రధాన అప్డేట్ Android 12 లో చాలా ప్రధాన మార్పులను చేయాలనీ చూస్తున్నట్లు, దీనికి సంబంధించి ఒక గుర్తుతెలియని టిప్స్టర్ అందించిన డాక్యుమెంటేషన్ ను మరియు స్క్రీన్ షాట్ల గురించి ఇందులో వివరించింది.

లీకైన ఆండ్రాయిడ్ 12 ఫీచర్లు

XDA డెవలపర్ ప్రకారం, UI  డిజైన్ ను పెద్ద నోటిఫికేషన్ టోగుల్ బటన్ తో వున్న స్క్రీన్ షాట్ ను షేర్ చేసింది. ఆండ్రాయిడ్ 11 లో ఆరు క్విక్ టోగుల్ బటన్స్ ఉండగా, ఆండ్రాయిడ్ 12 లో  నాలుగు మాత్రమే ఉన్నట్లు చూపించారు. అలాగే, iOS లో కనిపించే సెక్యూరిటీ టోగుల్ కూడా ఎగువ కుడి మూలలో ఒక సూచికను ఇస్తున్నట్లు సూచింది. అంటే, ఆండ్రాయిడ్ 12 లో పటిష్టమైన సెక్యురిటిని అందించడాని చూస్తున్నట్లు ఈ విషయం సూచిస్తుంది.

అంతేకాదు, లీకైన ఈ స్క్రీన్ షాట్ల ద్వారా ఆండ్రాయిడ్ 12 కోసం కాన్వర్జేషన్ విడ్జెట్స్ ను కూడా ఇవ్వడానికి చూస్తున్నట్లు అర్ధమవుతోంది మరియు మరిన్ని ఇతర ముఖ్యమైన ఫీచర్లను ఇవ్వడానికి చూస్తున్నట్లు కూడా ఊహిస్తున్నారు. అలాగే, రాబోయే కొద్దీ వారాల్లోనే ఆండ్రాయిడ్ 12 యొక్క డెవలపర్ ప్రివ్యూ ని విడుదల చేస్తుందని కూడా అంచనా వేస్తున్నారు.                   

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :