ప్రైవసీకి గొడ్డలి పెట్టు: Phone Number ఉంటే చాలు పూర్తి వివరాలు చెబుతున్న ఆన్లైన్ సైట్.!

Updated on 04-Dec-2025
HIGHLIGHTS

జస్ట్ Phone Number ఉంటే చాలు ఆ ఫోన్ కలిగిన వారి పూర్తి వివరాలు అందిస్తుంది

ఇది సైన్స్ ఫిక్షన్ లేదా అబద్ధం అంతకంటే కాదు

ఒక వెబ్‌సైట్ ఎదేచ్చగా మరియు ఉచితంగా అందించిన ఫీచర్

ప్రైవసీకి గొడ్డలి పెట్టు: ఈరోజు బయటపడిన ఒక న్యూస్ చూస్తే మీ కాళ్ళ కింద భూమి ఒక్కసారిగా బద్దలైన ఫీలింగ్ మీకు కలుగుతుంది. ఎందుకంటే, జస్ట్ Phone Number ఉంటే చాలు ఆ ఫోన్ కలిగిన వారి పూర్తి వివరాలు పూర్తిగా చూసేయొచ్చు. ఈ వార్త వినగానే మీకు కూడా చెమటలు పట్టాయా. ఇది సైన్స్ ఫిక్షన్ లేదా అబద్ధం అంతకంటే కాదు. ఇది అక్షర సత్యం మరియు ఇది ఒక వెబ్‌సైట్ ఎదేచ్చగా మరియు ఉచితంగా అందించిన ఫీచర్.

Phone Number ఉంటే వివరాలు అందించే సైట్ ఏమిటి?

భారతీయ మొబైల్ నెంబర్ ఉంటే చాలు ఈ సైట్ ఆ వ్యక్తి వివరాలు అన్ని కూడా జస్ట్ సెకండ్ లో మీ ముందు తెరిచి పెడుతుంది. ఈ సైట్ పేరు ProxyEarth.Org మరియు ఈ సైట్ అందరికి ఉచిత యాక్సెస్ అందిస్తుంది. దీనికోసం ఎటువంటి లాగిన్ లేదా పేమెంట్ చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ సైట్ లోకి వెళ్లి పైన ఉండే పెద్ద బాక్స్ లో సూచించిన వద్ద ఎవరిదైనా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి నెంబర్ ను ట్రాక్ చేయమని అడిగితే చాలు. వెంటనే ఆ సైట్ మీరు అడిగిన నెంబర్ కలిగిన వారి వివరాలు చకచకా అందిస్తుంది.

ఇక్కడ అందించే వివరాల్లో ఆ నెంబర్ కలిగిన వ్యక్తి పేరు, వారి అడ్రస్ మరియు వారి ఆల్టర్నేటివ్ మొబైల్ పూర్తి ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. మేము ఈ సైట్ నుంచి చెక్ చేసిన వివరాలు చాలా కచ్చితంగా ఉన్నాయి. అందుకే, ఈ సైట్ భారత ప్రజల ప్రైవసీకి గొడ్డలి పెట్టు అని సంభోదించాము. ఈ కొత్త చర్య చూస్తుంటే, మీ పేరు, ఫోన్ నెంబర్, లొకేషన్, సోషల్ అకౌంట్ వంటి ప్రజల ప్రైవసీ సమాచారం కూడా ఇప్పుడు కేవలం ఫోన్ లో క్లిక్ చేస్తే అందరికీ కనిపించే స్థాయికి పడిపోయింది.

ఇంతటితో ఈ మేటర్ అయిపో లేదు, మరో మేటర్ కూడా ఇక్కడ దాగి ఉంది. అదేమిటంటే, ప్రాక్సీ వెబ్సైట్ మేకవన్నె పులి లాంటివి. ఈ సైట్స్ సందర్శించే వారి IP అడ్రస్ నుంచి లాగిన్ పాస్వర్డ్స్ వరకు అన్ని సేకరించే విధంగా ఈ సైట్ ఉంటాయి. అంటే, ఇక్కడ ఇతరుల వివరాలు చెక్ చేయడానికి చూసే వారి డేటా కూడా చిక్కుల్లో పడుతుంది. ఇది రెండు అంచుల కత్తి లాగా పదునుగా ఉంటుంది.

Also Read: Flipkart Buy Buy 2025 Sale: 55 ఇంచ్ టీవీ రేటుకే 65 ఇంచ్ 4K Smart TV అందుకోండి.!

ఆన్లైన్ లో డేటా లీక్ అయ్యింది?

వాస్తవానికి, ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో డేటాకి తగిన రక్షణ లేకుండా పోయింది. ఇందుకు రీసెంట్ గా జరిగిన ఆధార్ డేటా లీక్, టెలికాం సైట్స్ లీక్ నుంచి ఫేక్ యాప్స్ వరకు ఎక్కడ చూసినా మీ డేటా చిక్కుల్లో ఉన్నట్లు సూచిస్తాయి. ప్రతి మన డేటా తీసుకుంటుంది, మనం నెట్టింట్లో వెతికే ప్రతి పనిని మన ఫోన్ లేదా సిస్టం సునిశితంగా పరిశీలిస్తూ ఉంటుంది. ముఖ్యంగా, ఎటువంటి సెక్యూరిటీ లేకుండా మనం ఉపయోగించే ఫ్రీ వెబ్సైట్ లేదా సర్వీస్ మన సమాచారం అంగట్లో పెట్టి నిలువునా అమ్మేస్తోంది.

అయితే, ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఇటివంటి సైట్స్ ప్రజల ప్రైవసీకి అతి ప్రమాదకారిగా చెబుతూ, ఇటివంటి సైట్స్ బంద్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం పై ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అధికారిక స్టేట్మెంట్ రావాల్సి ఉంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :