అమెజాన్ సమ్మర్ సేల్ వస్తోంది.. భారీ డీల్స్ తీసుకువస్తోంది..!!

Updated on 11-May-2022
HIGHLIGHTS

అమెజాన్ సమ్మర్ సేల్ వస్తోంది

Amazon Summer Sale ద్వారా భారీ ఆఫర్లు తీసుకువస్తోంది

ల్యాప్ టాప్స్ మరియు హెడ్ ఫోన్స్ పైన 70% వరకు డిస్కౌంట్

వన్ ప్లస్ సౌజన్యంతో అమెజాన్ సమ్మర్ సేల్ వస్తోంది. అమెజాన్ ఇప్పటికే ఈ సమ్మర్ సేల్ గురించి టీజింగ్ కూడా మొదలుపెట్టింది. అయితే, ప్రస్తుతానికి ఈ సేల్ నిర్వహించనున్న తేదిలను మాత్రం ఇంకా ప్రకటించలేదు. కానీ, ఈ సేల్ నుండి అందించనున్న ఆఫర్లు మరియు డీల్స్ గురించి మాత్రం టీజింగ్ చేస్తోంది. అమెజాన్ యొక్క ఈ అప్ కమింగ్ సేల్ ను ICICI, Kotak మరియు RBL Bank బ్యాంక్ భాగస్వామ్యంతో తీసుకువస్తోంది మరియు ఈ సేల్ నుండి ఈ బ్యాంకుల క్రెడిట్/డెబిట్ కార్డ్ తో ప్రోడక్ట్స్ కొనేవారికి 10% సేవింగ్ (డిస్కౌంట్) లభిస్తుంది. మరి త్వరలో రానున్న అమెజాన్ యొక్క ఈ అప్ కమింగ్ సేల్ నుండి ఎటువంటి ఆఫర్లు మరియు డీల్స్  అఫర్ చేయనున్నదో చూద్దామా.  

ఈ అప్ కమింగ్ అమెజాన్ సేల్ Amazon Summer Sale నుండి ల్యాప్ టాప్స్ మరియు హెడ్ ఫోన్స్ పైన 70% వరకు డిస్కౌంట్ అఫర్ చేయనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. అంతేకాదు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు మరియు AC ల పైన కూడా గరిష్టంగా 50% డిస్కౌంట్ ను అందించనున్నట్లు టీజింగ్ మొదలుపెట్టింది. హోమ్ & కిచెన్, ఫ్యాషన్ మరియు భారతీయ చిన్న వ్యాపారుల నుండి వచ్చిన యూనిక్ ప్రోడక్ట్స్ పైన 70% వరకూ డిస్కౌంట్ లను ఇవ్వనున్నట్లు చెబుతోంది. 

ఈ సేల్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్లు కూడా విడుదలకానున్నాయి. అప్ కమింగ్ లాంచ్ స్మార్ట్ ఫోన్స్ వన్ ప్లస్ నార్డ్ CE 2 లైట్, వన్ ప్లస్ 10R 5G, iQOO Z6 Pro   గురించి కూడా అమెజాన్ టీజింగ్ చేస్తోంది. త్వరలో సేల్ కి అందుబాటులోకి రానున్న గెలాక్సీ M53 5G మరియు మరిన్ని ఫోన్స్ ను కూడా వెల్లడించింది. ఇక ఈ సేల్ నుండి అతి తక్కువ ధరకు లభించనున్న ప్రోడక్ట్స్ విషయానికి వస్తే, స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషీన్స్, AC లు మరియు రిఫ్రిజిరేటర్లు డిస్కౌంట్ ఆఫర్లు మరియు డీల్స్ తో తక్కువ ధరకు లభించనున్నాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :