Amazon Prime సబ్ స్క్రిప్షన్ రేటు 50% పెంచుతున్నట్లు అమెజాన్ స్పష్టం చేసింది.డిసెంబర్ 14 నుండి అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ధర 1,499 రూపాయలకు మారుతుంది. అంటే, అప్పటివరకూ అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ కేవలం రూ.999 రూపాయలకే లభిస్తుంది. ఇది మాత్రమే కాదు నెలవారీ మరియు మూడు నెలల ప్లాన్‌ల ధరలను కూడా పెంచబోతున్నట్లు అమెజాన్ వెబ్‌సైట్ ద్వారా వెల్లడించింది. చవక ధరకే అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ పొందాలంటే డిసెంబర్ 13 తేదీ లోపల సబ్ స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది.
అయితే, వాస్తవానికి ఇప్పటివరకూ చవక ధరలో ఎక్కువ లాభాలను అందిస్తున్న సంస్థగా అమెజాన్ నిలుస్తుంది. ఎందుకంటే, కేవలం రూ. 999 రూపాయలకే అమెజాన్ సబ్ స్క్రిప్షన్ ను అఫర్ చేస్తోంది. దీనితో, అద్భుతమైన స్ట్రీమింగ్, ఉచిత డెలివరీ సర్వీస్ ను కూడా అఫర్ చేస్తోంది. కానీ, ఈ ధర వద్ద నెట్‌ఫ్లిక్స్, ఆపిల్ లేదా ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ల కోసం అలాంటి సేవలను అందించడం లేదు.
ఇక అమెజాన్ వెబ్ సైట్ పరిశీలించినట్లయితే, కొత్త అప్డేట్ లో మూడు నెలల సబ్ స్క్రిప్షన్ ను రూ .329 కి బదులుగా రూ .459 ధరలో చూపిస్తోంది. ఇక నెలవారి అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ కోసం రూ .129 కి బదులుగా రూ .179 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటి వరకూ పాత ధరల్లో అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ అందుకున్న కస్టమర్లు ముందు ముందు రోజుల్లో కొత్త రేట్లు చెల్లించాల్సి వస్తుంది.
అయితే, అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ కొత్త ధరలను డిసెంబర్ 14 నుండి అమలు చేస్తుంది. అంతేకాదు, ధరలు మరిన తరువాత కస్టమర్ల కార్డు నుండి ఆటోమేటిక్‌గా ఎలాంటి ఛార్జ్ తీసుకోబోమని కూడా కంపెనీ తెలిపింది.