అమెజాన్ ప్రైమ్ డే సేల్ మరో రెండు రోజుల్లో మొదలవనున్నది. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ అతిపెద్ద సేల్ నుండి అనేక ప్రొడక్స్ ను భారీ డిస్కౌంట్ ధరకే అమెజాన్ అందిస్తుంది. అంతేకాదు, అనేక కొత్త ప్రోడక్ట్ లను కూడా ఈ సేల్ నుండి లాంచ్ చేస్తుంది. ఈ సేల్ జూలై 23 వ తేది ఉదయం 12 గంటలకి మోదలవుతుంది మరియు 24 వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు ముగుస్తుంది. ఈ సేల్ నుండి మీకు నచ్చిన ప్రోడక్ట్ లను చవక ధరకే పొందే అవకాశం ఉంటుంది. ఇటీవల విడుదల చాలా ప్రోడక్ట్స్ కూడా అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి మొదటిసారి సేల్ కి అందుబాటులోకి వస్తాయి.
అమెజాన్ ప్రైమ్ డే సేల్ ను ICICI మరియు SBI బ్యాంక్ భాగస్వామ్యంతో తీసుకువస్తోంది. తద్వారా, ICICI మరియు SBI బ్యాంక్ కార్డ్స్ తో ప్రోడక్ట్స్ కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ లాభాలను అందించగలగుతుంది. అంటే, Amazon Prime Day సేల్ నుండి ICICI లేదా SBI బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ లతో వస్తువులను కొనుగోలు చేస్తే వారికి 10% అదనపు తగ్గింపు లభిస్తుంది.
అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి అమెజాన్ బ్రాండ్ ప్రోడక్ట్స్ మరియు టీవీల పైన గరిష్టంగా 70% వరకూ డిస్కౌంట్ అఫర్ చేయనున్నట్లు ప్రకటించింది. అలాగే, మొబైల్స్ పైన 40%, టీవీలు మరియు అప్లయన్సెస్ పైన గరిష్టంగా 50% వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు సూచించింది. మంచి ల్యాప్ టాప్ లేదా హెడ్ ఫోన్ కోసం చూస్తున్న వారికి Amazon Prime Day సేల్ మంచి సమయం కావచ్చు. ఎందుకంటే, ఈ సేల్ నుండి ల్యాప్ టాప్ మరియు హెడ్ ఫోన్ వంటి మరిన్ని గ్యాడ్జెట్స్ పైన గరిష్టంగా 75% డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు చెబుతోంది.
అమెజాన్ ప్రైమ్ డే సేల్ యొక్క మరిన్ని ఆఫర్ల విషయానికి వస్తే, సేల్ జరగనున్న రెండు రోజులు కూడా సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల మధ్య 'WoW Deals' అందుబాటులో ఉంటుంది. అలాగే, కిచెన్ సామానులు హోమ్ డెకరేషన్ వస్తువుల పైన కూడా 70% డిస్కౌంట్ అందించనున్నట్లు అమెజాన్, Prime Day సేల్ కోసం అందించిన మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ మొదలుపెట్టింది.