Amazon Pay Later సర్వీస్ ప్రారంభం : షాపింగ్ ఇప్పుడు చేసి డబ్బును తరువాత EMI లో కట్టవచ్చు

Updated on 29-Apr-2020

అమేజాన్ ఇండియా తన ఆన్లైన్ ప్లాట్ ఫారమ్ అయిన amazon.in లో కొత్త సర్వీసును ప్రకటించింది. ఈ సర్వీస్,  షాపింగ్ చేసే అర్హతగల కస్టమర్లకు తక్షణ క్రెడిట్ ఇవ్వడం లక్ష్యంగా ‘అమెజాన్ పే లేటర్’ అనే ఈ కొత్త సర్వీస్ ను ప్రారంభించింది. ఈ సర్వీస్,  ప్రజలను డిజిటల్ ‌సైన్ అప్ చేయడానికి అనుమతిస్తుంది మరియు వారికీ కావాల్సిన ప్రొడక్టులను కొనుగోలు చేయడానికి వారికీ తక్షణ క్రెడిట్ ‌ను పొందడానికి అనుమతిస్తుంది. అంతేకాదు, క్రెడిట్ బిల్లులను చెల్లించడానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఇక ఈ క్రెడిట్ ను ఎలా తిరిగి చెలించాలి అని చూస్తే, తరువాత నెలలో ఎటువంటి వడ్డీ  లేకుండా లేదా ఎక్కువ సమయం కావాలనుకుంటే అదనపు వడ్డీతో 12 నెలల వరకు EMI లలో తిరిగి చెల్లించవచ్చు.

గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, కిరాణా సామాగ్రి వంటి వస్తువుల  కొనుగోలు కోసం మరియు బిల్ చెల్లింపు వంటి వాటికోసం  వినియోగదారులకు ఉపయోగపడడాన్ని లక్ష్యంగా చేసికొని ఈ సర్వీస్ తెస్తోంది. ఈ-టైలర్ క్యాపిటల్ ఫ్లోట్ మరియు కరూర్ వైశ్యా బ్యాంక్ (KVB) లతో భాగస్వామ్యంగా చేసుకోవడం వలన ఈ సర్వీస్ ను సాధ్యం చేసింది. పునరావృతమయ్యే బిల్లుల కోసం వినియోగదారులకు ఆటో -రీ పేమెంట్ ను సెటప్ చేసే అవకాశం కూడా ఉంటుందని కంపెనీ తన అధికారిక బ్లాగులో పేర్కొంది. వినియోగం మరియు తిరిగి చెల్లించే వారి హిస్టరీ ఆధారంగా, వినియోగదారులు వారి క్రెడిట్ పరిమితిని కూడా పెంచుకోగలుగుతారు.

ఈ సర్వీస్ కోసం sign UP  అప్ చేయడానికి, వినియోగదారులు వారి పాన్ కార్డ్ నంబర్ మరియు వారి ఆధార్ కార్డు నంబర్ ‌ను షేర్ చేయాలి. అర్హత ఉన్న వినియోగదారులకు సైన్ అప్ చేయడానికి క్రెడిట్ కార్డ్ అవసరం లేదని కూడా గమనించాలి. వాస్తవానికి, ఈ సర్వీస్ 2018 సెప్టెంబర్ ‌లో ప్రారంభించిన Amazon Pay EMI సర్వీస్ తో సమానంగా ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :