Amazon launches Prime subscription limited period discount offer
Amazon Prime సబ్ స్క్రిప్షన్ పై అమెజాన్ ఇండియా గొప్ప డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. ముందుగా వెయ్యి రూపాయల కంటే తక్కువ ధరలో లభించిన అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ రేటును అమెజాన్ రూ. 1,499 రూపాయల ధరకు పెంచేసింది. అయితే, ప్రస్తుతం అందించిన లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ద్వారా కేవలం రూ. 999 ధరకే ఈ సబ్ స్క్రిప్షన్ ను ఆఫర్ చేస్తోంది.
అమెజాన్ ప్రైమ్ డే సందర్భంగా అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ పై లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ అందించింది. అమెజాన్ ప్రైమ్ వన్ ఇయర్ సబ్ స్క్రిప్షన్ ప్రస్తుత ధర రూ. 1,499 రూపాయలు ఉండగా, ఇప్పుడు ఈ ప్రైమ్ డే సేల్ కోసం కేవలం రూ. 999 రూపాయల ఆఫర్ రేటుకే ఈ సబ్ స్క్రిప్షన్ అందుకునే అవకాశం అమెజాన్ అందించింది. సంవత్సరానికి ఒక్కసారి అమెజాన్ తీసుకొచ్చే ప్రైమ్ డే సేల్ సందర్భంగా ఈ బిగ్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది.
అంటే, ఇప్పుడు అమెజాన్ ఆఫర్ చేస్తున్న అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ఆఫర్ తో కేవలం నెలకు కేవలం రూ. 84 రూపాయల అతి తక్కువ రేటుకే అందుకునే అవకాశం అందించింది. ఆఫర్ చెక్ చేయడానికి Click Here పై నొక్కండి.
Also Read: Nothing Phone 3 ఫోన్ ఆపాదమస్తకం సరికొత్త వివరాలతో లాంచ్ అయ్యింది.!
అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ తీసుకునే వారికి అమెజాన్ అనేక లాభాలు అందిస్తుంది. అందులో మొదటిది ఎంటర్టైన్మెంట్ ప్రయోజనం. ఈ సబ్ స్క్రిప్షన్ తో సంవత్సరం మొత్తం ప్రైమ్ వీడియో లో అన్లిమిటెడ్ కంటెంట్ యాక్సెస్ లభిస్తుంది. ఈ వన్ ఇయర్ సబ్ స్క్రిప్షన్ తీసుకునే వారికి రెండు టీవీలతో కలిపి మొత్తం 5 పరికరాల్లో 4K UHD యాక్సెస్ అందిస్తుంది. ఈ సబ్ స్క్రిప్షన్ తో వచ్చే రెండవ లాభం ఉచిత డెలివరీ సౌలభ్యం.
అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ తీసుకునే వారికి సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ ఉచిత డెలివరీ యాక్సెస్ అందిస్తుంది. అంతేకాదు, ఈ సబ్ స్క్రిప్షన్ తో ప్రైమ్ మ్యూజిక్, ప్రైమ్ రీడింగ్ మరియు ప్రైమ్ గేమింగ్ కోసం కూడా ఉచిత యాక్సెస్ అందిస్తుంది. అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ తో సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ మరియు ఉచిత డెలివరీ ఎంజాయ్ చేయవచ్చు.