2022 రిపబ్లిక్ డే సందర్భంగా అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ప్రకటించింది. ఈ సేల్ జనవరి 17 నుండి జనవరి 20 వరకు నిర్వహించబడుతుంది. అయితే, ప్రైమ్ మెంబర్స్ 24 గంటల ముందే సేల్ యాక్సెస్ అందుతుంది. అంటే, Amazon Prime సభ్యులు ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుండి ఈ సేల్ యాక్సెస్ ను అందుకుంటారు. ఈ సేల్ నుండి భారీ ఆఫర్లను మరియు డీల్స్ తీసుకొస్తున్నట్లు అమెజాన్ తెలిపింది.
అమెజాన్ ఈ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2022 ను SBI భాగస్వామ్యంతో తీసుకొచ్చింది మరియు SBI క్రెడిట్ కార్డ్‌ల పైన 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ ను అందిస్తోంది. ఇది మాత్రమే కాదు, అమెజాన్ నో-కాస్ట్ EMI మరియు క్యాష్‌బ్యాక్‌ను కూడా అందించే అవకాశం ఉంది.
ఇప్పటికే చేస్తున్న టీజింగ్ మరియు మరిన్ని అంచనాల ప్రకారం, బడ్జెట్ విభాగాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్ ఫోన్ల పైన బెస్ట్ డీల్స్ మరియు ఆఫర్ లతో సహా మొబైల్స్ మరియు యాక్సెసరీలపై 40% వరకు తగ్గింపును అందజేయనున్నట్లు అమెజాన్ వెల్లడించింది. అలాగే, ల్యాప్ టాప్స్ పైన గరిష్టంగా 40,000 వరకూ భారీ డిస్కౌంట్, టీవీల పైన 50% వరకూ డిస్కౌంట్ మరియు హెడ్‌ఫోన్‌లపై 75% వంటి చాలా డీల్స్ మరియు ఆఫర్లను ఇవ్వనున్నట్లు చెబుతోంది.