భారీ ఆఫర్లతో వస్తున్న అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2023.!

HIGHLIGHTS

అమెజాన్ అతిపెద్ద సేల్ డేట్ అనౌన్స్ చేసింది

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2023 నుండి మంచి ఆఫర్లను ఇవ్వనున్నట్లు చెబుతోంది

అమెజాన్ తీసుకువస్తున్న అప్ కమింగ్ సేల్

అమెజాన్ యొక్క అతిపెద్ద సేల్ 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2023' ను నిర్వహించనున్న తేదీలను అమెజాన్ ప్రకటించింది. ఈ అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 15 వ తేదీ నుండి జనవరి 20 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు అమెజాన్ అనౌన్స్ చేసింది. ఈ సేల్ నుండి భారీ ఆఫర్లను మరియు డీల్స్ ను కూడా అందించనున్నట్లు కూడా అమెజాన్ టీజింగ్ మొదలుపెట్టింది. రిపబ్లిక్ డే సందర్భంగా అమెజాన్ తీసుకువస్తున్న ఈ అప్ కమింగ్ సేల్ వివరాలు ఏమిటో తెలుసుకుందామా. 

అమెజాన్ తీసుకువస్తున్న అప్ కమింగ్ సేల్ amazon great republic day sale 2023 సేల్ నుండి మంచి ఆఫర్లను ఇవ్వనున్నట్లు చెబుతోంది. ఇందులో అప్ కమింగ్ డీల్స్ లో భాగంగా బ్లాక్ బాస్టర్ డీల్స్, బడ్జెట్ బజార్, ప్రీ-బుక్ మరియు 8PM డీల్ వంటివి ఉంటాయని వెల్లడించింది. ఈ సేల్ ను SBI బ్యాంక్ భాగస్వామ్యంతో అందిస్తోంది. అందుకే, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు EMI అప్షన్ తో ప్రోడక్ట్స్ కొనుగోలు చేసే వారికీ 10% అదనపు డిస్కౌంట్ ను అఫర్ చేస్తుంది.

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుండి టీవీలు మరియు గృహోపకరణాల పైన గరిష్టంగా 65% వరకూ డిస్కౌంట్ అందించనున్నట్లు సేల్ టీజింగ్ పేజ్ ద్వారా టీజింగ్ చేస్తోంది. అలాగే, Alexa, FireTv మరియు Kindlle వంటి సొంత ప్రోడక్ట్స్ పైన గరిష్టంగా 45% వరకు డిస్కౌంట్ అఫర్ చేయనున్నట్లు కూడా చెబుతోంది. 

ఇక కొత్త ప్రోడక్ట్స్ మరియు లాంచెస్ విషయానికి వస్తే, ఈ సేల్ నుండి 60 కి పైగా కొత్త ప్రోడక్ట్స్ సేల్ కి అందుబాటులో ఉంటాయని మరియు మంచి ఆఫర్లు కూడా ఈ ప్రోడక్ట్స్ పైన అందుకోవచ్చని తెలుస్తోంది. ఇందులో, కొత్తగా లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్, ఇయర్ బడ్స్, సౌండ్ బార్స్ మరియు మరిన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :