Amazon Great Indian Festival sale announced with great deals
Amazon Great Indian Festival సేల్ ను భారీ ఆఫర్స్ తో అమెజాన్ ఇండియా అనౌన్స్ చేసింది. 2025 పండుగ సీజన్ సందర్భంగా తీసుకొచ్చిన ఈ సేల్ నుంచి భారీ ఆఫర్లు మరియు డీల్స్ అందుకోండి అని అమెజాన్ టీజింగ్ మొదలుపెట్టింది. దసరా మరియు దీపావళి పండుగ కోసం ఆఫ్ లైన్ స్టోర్స్ ఇప్పటికే పండుగ సేల్ మరియు ఆఫర్లు ప్రకటించగా అతిపెద్ద ఈ కార్ట్ కంపెనీ అమెజాన్ కూడా 2025 పండుగ సీజన్ సేల్ అనౌన్స్ చేసింది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ డేట్ ను అమెజాన్ ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ అతిపెద్ద సేల్ త్వరలో ప్రారంభం అవుతుందని టీజింగ్ మాత్రం స్టార్ట్ చేసింది. ఈ సేల్ కోసం అందించిన ప్రత్యేకమైన మైక్రో సైట్ టీజర్ పేజీ నుంచి సేల్ డీల్స్ తో కూడిన వివరాలతో టీజింగ్ చేస్తోంది. అయితే, ఈ సేల్ సెప్టెంబర్ రెండో వారంలో ప్రారంభం అయ్యే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ను భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో తీసుకువస్తున్నట్లు అమెజాన్ గొప్పగా చెబుతోంది. ఈ సేల్ నుంచి అందించనున్న స్మార్ట్ ఫోన్ డీల్స్ ను ఈ టీజర్ పేజీ నుంచి టీజింగ్ చేస్తోంది. అమెజాన్ టీజింగ్ చేస్తున్న ఫోన్స్ లిస్ట్ లో శామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, వన్ ప్లస్ 13s, ఐకూ 13 వంటి ప్రీమియం స్మార్ట్ ఫోన్లు కూడా ఉన్నాయి.
ఇవి మాత్రమే కాదు, ఈ అప్ కమింగ్ బిగ్ సేల్ నుంచి అందించనున్న బెస్ట్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ డీల్స్ కూడా రివీల్ చేసింది. ఈ సేల్ నుంచి వన్ ప్లస్ నార్డ్ CE5, ఐకూ నియో 10R, శామ్సంగ్ గెలాక్సీ A55, ఐకూ జెడ్10 ఆర్ మరియు వన్ ప్లస్ నార్డ్ 5 వంటి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అలాగే, రెడ్ మీ A4 5జి, రియల్ మీ నార్జో 80 లైట్ 5జి, శామ్సంగ్ గెలాక్సీ M36 5జి మరియు ఐకూ Z10x 5జి వంటి బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు కూడా ఉన్నాయి.
Also Read: AI Scam: QR కోడ్, ఫోన్ కాల్ మరియు వాట్సాప్ స్కామ్ నుంచి ఎలా తప్పించుకోవాలి.!
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కోసం SBI బ్యాంక్ పార్ట్నర్ గా తీసుకుంది. అందుకే, ఈ సేల్ నుంచి SBI క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ తో వస్తువులు కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ సేల్ నుంచి స్మార్ట్ టీవీలు, స్మార్ట్ వాచ్ లు మరియు సౌండ్ బార్ వంటి మరిన్ని ప్రొడక్ట్స్ పై కూడా భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందుకోవచ్చని అమెజాన్ టీజింగ్ చేస్తోంది.