గుడ్ న్యూస్: Amazon Great Freedom Festival సేల్ భారీ ఆఫర్లతో వచ్చేస్తోంది.!

HIGHLIGHTS

Amazon Great Freedom Festival సేల్ భారీ ఆఫర్లతో వచ్చేస్తోంది

2024 స్వాతంత్య్ర దినోత్సవ వేడుక సందర్భంగా ఈ బిగ్ సేల్ ను అమెజాన్ అనౌన్స్ చేసింది

ఈ సేల్ నుంచి అందించనున్న ఆఫర్లు కూడా అమెజాన్ ఇప్పుడు వెల్లడించింది

Amazon Great Freedom Festival సేల్ భారీ ఆఫర్లతో వచ్చేస్తోంది. 2024 స్వాతంత్య్ర దినోత్సవ వేడుక సందర్భంగా ఈ బిగ్ సేల్ ను అమెజాన్ అనౌన్స్ చేసింది. ఈ సేల్ నుంచి భారీ డీల్స్, బ్యాంక్ ఆఫర్ లతో పాటు మరిన్ని ఇతర ఆఫర్లు కూడా తీసుకు వస్తున్నట్లు అమెజాన్ ఆటపట్టిస్తోంది. ఈ సేల్ నుంచి అందించనున్న కొన్ని డీల్స్ మరియు ఆఫర్లను కూడా ఇప్పుడు టీజర్ పేజి నుంచి బయటపెట్టింది.

Amazon Great Freedom Festival

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ను లేటెస్ట్ గా అమెజాన్ ఇండియా ప్రకటించింది. ఈ సేల్ నుంచి అందించనున్న ఆఫర్లు కూడా అమెజాన్ ఇప్పుడు వెల్లడించింది. అయితే, ఈ సేల్ ఎప్పటి నుంచి మొదలవుతుంది అని మాత్రం ఇంకా తెలియ చేయలేదు. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ త్వరలో మొదలవుతుంది అని మాత్రం ప్రకటించింది.

ఈ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ను SBI బ్యాంక్ భాగస్వామ్యంతో తీసుకు వస్తోంది. అందుకే, ఈ సేల్ నుండి SBI బ్యాంక్ క్రెడిట్ కార్డు మరియు EMI ఆప్షన్ తో ప్రొడక్ట్స్ ను కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.

Also Read: Realme 13 Pro Plus 5G: మిడ్ రేంజ్ ధరలో స్టన్నింగ్ ఫీచర్స్ తో వచ్చింది.!

Amazon Great Freedom Festival: ఆఫర్స్

అమెజాన్ అప్ కమింగ్ సేల్ ‘గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్’ మొబైల్ ఫోన్స్ పైన అతి భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేయనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. ఈ సేల్ నుంచి వన్ ప్లస్, శామ్సంగ్, రియల్ మీ, ఐకూ, షియోమీ, హానర్ మరియు లావా వంటి చాలా మొబైల్ అందించిన లేటెస్ట్ మొబైల్స్ పై భారీ డిస్కౌంట్ లు అందుకోవచ్చని అమెజాన్ చెబుతోంది. ఈ సేల్ నుంచి మొబైల్ ఫోన్స్ పై 40% వరకు డిస్కౌంట్ లను పొందవచ్చని అమెజాన్ ఆటపట్టిస్తోంది.

ఈ సేల్ నుంచి అమెజాన్ అందించనున్న ఇతర ఆఫర్ల విషయానికి, ఈ సేల్ నుంచి ఎలక్ట్రానిక్స్ మరియు యాక్ససరీస్ పైన 80% వరకు డిస్కౌంట్ ను ఆఫర్ చేయబోతున్నట్లు చెబుతోంది. గేమింగ్ మరియు టాయ్స్ పై 70% తగ్గింపు, స్మార్ట్ టీవీలు మరియు అప్లయన్సెస్ పై 65% వరకు డిస్కౌంట్ పొందే వీలుంది.

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుంచి అనేకమైన ప్రొడక్ట్స్ ను గొప్ప డిస్కౌంట్ తో చాలా సరసమైన ధరలకు అందుకునే అవకాశం ఉందని అమెజాన్ టీజింగ్ చేస్తోంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :