Amazon Electronics Premier League sale starts tomorrow with big deals and offers
Amazon Electronics Premier League సేల్ రేపటి నుంచి భారీ డీల్స్ మరియు ఆఫర్స్ తో ప్రారంభం అవుతుంది. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ముగిసిన చాలా రోజుల తర్వాత అమెజాన్ ఈ అతి పెద్ద సేల్ ప్రకటించింది. ఈ సేల్ నుంచి అనేక ఎలక్ట్రానిక్ ఉపకరణాలను భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో అతి తక్కువ ధరలో అందుకోవచ్చని అమెజాన్ గొప్పగా టీజింగ్ చేస్తోంది. అమెజాన్ కొత్తగా ప్రకటించిన ఈ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ సేల్ వివరాలు ఏమిటో ఒక లుక్కేద్దాం పదండి.
అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్ రేపటి నుంచి మొదలవుతుంది. ఈ అతి పెద్ద సేల్ మార్చి 6వ తేదీ నుంచి మార్చి 12వ తేదీ వరకు నిర్వహించబడుతుంది. అంటే, ఈ సేల్ వారం రోజులు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ నుంచి అనేక ప్రొడక్ట్స్ పై భారీ డీల్స్ మరియు ఆఫర్లు అందుకోవచ్చని అమెజాన్ టీజింగ్ చేస్తోంది.
ఈ లేటెస్ట్ సేల్ నుంచి HDFC బ్యాంక్ భాగస్వామ్యంతో అందించింది. అందుకే, ఈ సేల్ నుంచి HDFC బ్యాంక్ కార్డ్ లను ఉపయోగించి ప్రొడక్ట్స్ కొనుగోలు చేసే వారికి గరిష్టంగా రూ. 4,500 వరకు డిస్కౌంట్ అందిస్తుంది.
Also Read: Dolby Atmos మరియు DTS X సౌండ్ సపోర్ట్ తో కొత్త సౌండ్ బార్ లాంచ్ చేసిన Zebronics
రేపటి నుంచి మొదలవబోతున్న ఈ అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్ నుంచి లేటెస్ట్ ఎయిర్ కండిషన్లు, ఎయిర్ కూలర్లు మరియు రిఫ్రిజిరేటర్ల పైన జబర్దస్త్ డిస్కౌంట్ అందుకోవచ్చని అమెజాన్ చెబుతోంది. ఇది మాత్రమే కాదు ఇండియన్ మార్కెట్లో సరికొత్తగా విడుదలైన స్మార్ట్ ఫోన్స్ పైన కూడా హార్ట్ డీల్స్ అందుకోవచ్చని అమెజాన్ ఉరిస్తోంది. ఐకు లేటెస్ట్ గా విడుదల చేసిన iQOO 15R మరియు Samsung లేటెస్ట్ గా విడుదల చేసిన Galaxy S26 Series వంటి కొత్త ఫోన్లు కూడా ఉన్నాయి.
ఇక ఇతర ఆఫర్ల విషయానికి వస్తే, ఈ సేల్ నుంచి లేటెస్ట్ ల్యాప్ టాప్స్ ను మంచి డిస్కౌంట్ ధరలో అందుకోవచ్చు. ఇది కాకుండా వాషింగ్ మెషీన్స్, హెడ్ ఫోన్స్ మరియు ఇయర్ బడ్స్ పై కూడా గొప్ప డిస్కౌంట్స్ అందుకోవచ్చట. ఇవి కాకుండా సౌండ్ బార్ మరియు స్మార్ట్ టీవీ లపై జబర్దస్త్ డిస్కౌంట్లు పొందే అవకాశం ఉంటుంది.
ఓవరాల్ గా చూస్తే, ఈ అతిపెద్ద సేల్ నుంచి చాలా గ్యాడ్జెట్స్ మరియు ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ ను మంచి డిస్కౌంట్ తో ఆఫర్ ధరలో అందుకునే అవకాశం ఉంటుంది.