Amazon ఇండియా ఈరోజు " WOW Salary Days " సేల్ సేల్ ప్రకటించింది. ఈ సేల్ నుండి టీవీలు, ఫ్రిడ్జ్ లు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్ మరియు సౌండ్ బార్ లతో పాటుగా అనేకమైన ప్రొడక్స్ట్ పైన భారీ డీల్స్ మరియు డిస్కౌంట్ ప్రకటించింది. ఈ అమెజాన్ వావ్ శాలరీ డేస్ సేల్ 1 అక్టోబర్ నుండి 5 అక్టోబర్ వరకు అందుబాటులో ఉంటుంది.
ఈ సేల్ గురించి అమెజాన్ తెలిపిన ప్రకారం, 'వావ్ శాలరీ డేస్' సందర్భంగా, వినియోగదారులు LG, Bosch, Bajaj, Bose, Sony, Dell, Mi Android TVs, Hometown, Duroflex, Sleepwel వంటి మరిన్ని ప్రముఖ బ్రాండ్ల నుండి అధిక విలువ కలిగిన ఉత్పత్తులపై ఎక్కువ పొదుపు ని అందుకోవచ్చని చెబుతోంది. అంతేకాదు వీటిని No-Cost EMI మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్ల వంటి సరసమైన ఫైనాన్స్ ఎంపికలతో కూడా పొందవచ్చని కూడా ప్రకటించింది.
ఈ సేల్ నుండి మీరు HSBC బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డు లేదా EMI ద్వారా వస్తువులను కొన్నట్లయితే, 10% అధనపు డిస్కౌంట్ పొందవచ్చు. ముఖ్యంగా, ఈ సేల్ నుండి సౌండ్ బార్స్ మరియు టీవీ లను కొనాలని చూస్తున్న వారికీ మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఎందుకంటే, కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ పైన 50% వరకూ, టీవీల పైన 45% వరకూ డిస్కౌంట్ మరియు మరిన్ని ఆఫర్లను అమెజాన్ ఈ సేల్ నుండి అఫర్ చేస్తోంది.