OnePlus Community sale ప్రకటించిన అమెజాన్..సేల్ ఆఫర్లు మాములుగా లేవుగా.!

HIGHLIGHTS

అమెజాన్ ఇండియా అప్ కమింగ్ సేల్ అనౌన్స్ చేసింది

OnePlus Community sale అనౌన్స్ చేసిన అమెజాన్

ఈ వన్ ప్లస్ కమ్యూనిటీ సేల్ జూన్ 6వ తేది నుండి మోదలవుతుంది

OnePlus Community sale ప్రకటించిన అమెజాన్..సేల్ ఆఫర్లు మాములుగా లేవుగా.!

అమెజాన్ ఇండియా అప్ కమింగ్ సేల్ అనౌన్స్ చేసింది. అదే, OnePlus Community sale మరియు ఈ సేల్ నుండి వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్స్, ప్యాడ్స్, స్మార్ట్ వాచ్, ఇయర్ బడ్స్ మరియు స్మార్ట్ టీవీల పైన భారీ డిస్కౌంట్ మరియు ఇతర ఆఫర్లను అందిచనున్నట్లు ప్రకటించింది. అమెజాన్ అనౌన్స్ చేసిన ఈ వన్ ప్లస్ కమ్యూనిటీ సేల్ జూన్ 6వ తేది నుండి మోదలవుతుంది మరియు జూన్ 11 వ తేదీ రాత్రి 12 గంటలకు ముగుస్తుంది. ఈ సేల్ ని ICICI బ్యాంక్ భాగస్వామ్యంతో అఫర్ చేయనున్నట్లు కూడా అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ సేల్ వివరాలేమిటో తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

OnePlus Community sale

ఈ అప్ కమింగ్ సేల్ నుండి వన్ ప్లస్ యొక్క లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ల పైన గొప్ప ఆఫర్లను ఇవ్వనున్నట్లు టీజింగ్ చేస్తోంది. ఈ సేల్ నుండి వన్ ప్లస్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లయిన Oneplus 11 5G, Oneplus 11R, Oneplus 10R మరియు Oneplus 10T ఫోన్ లను డిస్కౌంట్ ధరలకు ఆఫర్ల చేయనట్లు తెలిపింది మరియు ఈ ఫోన్ల సేల్ అఫర్ ధరలను Rs XX,XXX రూపంలో టీజింగ్ చేసింది.

అంతేకాదు, వన్ ప్లస్ యొక్క బడ్జెట్ మరియు మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్ అయిన Oneplus Nord 2T, వన్ ప్లస్ నార్డ్ CE3 లైట్, నార్డ్ CE2 లైట్, నార్డ్ CE 25G ఫోన్ల పైన కూడా డిస్కౌంట్ ధరలను అందించనున్నట్లు కూడా తెలిపింది. 

కేవలం స్మార్ట్ ఫోన్లు మాత్రమే కాదు వన్ ప్లస్ యొక్క అన్ని బడ్స్ మరియు స్మార్ట్ టీవీల పైన గొప్ప ఆఫర్లను అందించనున్నట్లు కూడా టీజింగ్ ద్వారా తెలిపింది. అయితే, ఈ ప్రోడక్ట్ లను డైరెక్ట్ డిస్కౌంట్ తో అఫర్ చేస్తుందా? లేక బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ ధర తో అఫర్ చేస్తుందా? అనే విషయం మాత్రం ప్రశ్న గానే మిగిలింది. 

అయితే, ICICI బ్యాంక్ మరియు OneCard లతో ఈ OnePlus Community sale నుండి వన్ ప్లస్ ప్రోడక్ట్స్ ను కొనెను గోలు చేసే వారికి రూ. 5,000 వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ విషయాన్ని టీజర్ పేజ్ ద్వారా వెల్లడించింది. అలాగే, జూన్ 4 వ తేదీ నుండి Early Access అందుతుందని కూడా తెలిపింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo