Amazon announces Great Republic Day Sale 2024 1
అమేజాన్ ఇండియా కోప్ కమింగ్ సేల్ ను అనౌన్స్ చేసింది. భారీ Amazon Great Republic Day Sale 2024 సేల్ ను అమేజాన్ అనౌన్స్ చేసింది. ఈ సేల్ ను SBI బ్యాంక్ భాగస్వామ్యంతో తీసుకు వస్తోంది మరియు గొప్ప ఎక్స్ చేంజ్ ఆఫర్ లను కూడా అందిస్తునట్లు కూడా తెలిపింది. అమేజాన్ అప్ కమింగ్ సేల్ నుండి అందించనున్న డీల్స్ మరియి ఆఫర్లు ఎలా ఉండబోతున్నాయో ఒక లుక్కేద్దాం పదండి.
అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 డేల్ ను అమేజాన్ ఇంకా ప్రకటించ లేదు. అయితే, Coming Soon బ్యానర్ తో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 గురించి టీజింగ్ ను మాత్రం మొదలు పెట్టింది. అంతేకాదు, ఈ బిగ్ సేల్ నుండి అందించను అడల్స్ మరియు ఆఫర్లను కూడా ఈ టీజర్ పేజ్ ద్వారా టీజ్ చేస్తోంది.
Also Read : Moto G34 5G: 50MP క్వాడ్ కెమేరా మరియు వేగాన్ లెథర్ తో లాంఛ్ అవుతోంది.!
ఈ టీజర్ పేజ్ ద్వారా, అమేజాన్ అప్ కమింగ్ సేల్ నుండి గ్రాండ్ ఓపెనింగ్ డీల్స్, బ్లాక్ బాస్టర్ డీల్స్ మరియు 8PM డీల్స్ వంటి మరిన్ని డీల్స్ ను ఆఫర్ చేయబోతున్నట్లు టీజింగ్ చేస్తోంది.
అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 నుండి సెలెక్టెడ్ మొబైల్ ఫోన్స్ పైన 40% వరకూ డిస్కౌంట్ ను ఆఫర్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ సేల్ నుండి హోమ్ కిచెన్ & అవుట్ డోర్ ప్రోడక్ట్స్ పైన 50% డిస్కౌంట్ అను ఆఫర్ చేయబోతున్నట్లు కూడా తెలిపింది.
ల్యాప్ టాప్స్, స్మార్ట్ వాచ్, హెడ్ ఫోన్స్, ట్యాబ్ లెట్స్ మరియు మరిన్ని ఎలక్ట్రానిక్ పరికరాల పైన 75% వరకూ భారీ డిస్కౌంట్ లను ఆఫర్ చేయబోతున్నట్లు కూడా అమేజాన్ తెలిపింది.
ఇది మాత్రమే కాదు, అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 నుండి టీవీలు మరియు గృహోపకరణాల పైన కూడా 65% వరకూ భారీ డిస్కౌంట్ లను అందించ బోతున్నట్లు అమేజాన్ టీజర్ పేజ్ ద్వారా టీజింగ్ చేస్తోంది.