2022 రిపబ్లిక్ డే సందర్భంగా, అమెజాన్ తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ని ప్రకటించింది. అమెజాన్ ఈ సేల్ నుండి అనేకమైన ప్రోడక్ట్స్ పైన భారీ డిస్కౌంట్, బ్యాంక్ అఫర్ మరియు మరిన్ని డీల్స్ అందించనున్నట్లు టీజింగ్ కూడా మొదలు పెట్టింది. 2022 లో అమెజాన్ యొక్క ఈ మొదటి సేల్ నుండి మంచి డీల్స్ అందుకునే అవకాశం వుంది. ఈ సేల్ డేట్ ఇంకా ప్రకటించనప్పటికీ ఈ సేల్ త్వరలోనే మొదలవుతుంది. అమెజాన్ ఇండియా ఆన్లైన్ ప్లాట్ఫారం ప్రధాన పేజ్ బ్యానర్ ద్వారా ఈ సేల్ గురించి టీజ్ చేస్తోంది.
అమెజాన్ ఈ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సేల్ ని SBI భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది మరియు ఈ సేల్ నుండి SBI బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డు ద్వారా వస్తువులను కొనుగోలు చేసే వినియోగదారులకు 10% అధనపు డిస్కౌంట్ అఫర్ ను కూడా ప్రకటించింది. అలాగే, అమెజాన్ కూపన్స్, రివార్డ్స్ ఫెస్టివల్ వంటి మరిన్ని లాభదాయకమైన ఆఫర్లను కూడా ప్రకటించింది.
ప్రతి సంవత్సరం కూడా అమెజాన్ రిపబ్లిక్ డే సమయంలో ఈ అమ్మకాన్ని ప్రారంభిస్తుంది. ఈ సేల్ నుండి మొబైల్ ఫోన్స్ పైన భారీ డీల్స్ ని అందిస్తుంది. అలాగే, హెడ్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ మరియు మరిన్ని ప్రోడక్ట్స్ పైన గరిష్టంగా 70% వరకు తగ్గింపు ఈ సేల్ నుండి అందిస్తున్నట్లు ఇప్పటికే టీజింగ్ మొదలుపెట్టింది. అదనంగా, కొత్త ప్రోడక్ట్స్ లాంచ్, No Cost EMI మరియు మరిన్ని లాభాలను కూడా అందిస్తుంది.
ముఖ్యంగా, కొత్త సంవత్సరంలో కొత్త టీవీ లేదా వాషింగ్ మెషిన్ వంటి వస్తువులను కొనాలని చూస్తున్న వారికి ఈ సేల్ సరైన సమయం కావచ్చు. ఎందుకంటే, టీవీలు మరియు వాషింగ్ మెషిన్,ఫ్రిడ్జ్ వంటి లార్జ్ అప్లయన్సెస్ పైన 50% వరకూ భారీ డిస్కౌంట్ ఆఫర్ల చేయనున్నట్లు అమెజాన్ ప్రకటించింది.