రిలయన్స్ జియో ఇటీవల కొత్త కనెక్షన్ తీసుకోనున్న కస్టమర్లకు ఒక నెల ఉచిత జియో ఫైబర్ అఫర్ ప్రకటించింది. అంతేకాదు, కేవలం నెలకు రూ 399 ప్లానుతో వినియోగదారులకు అపరిమిత డేటాతో సహా మరెన్నో ప్రయోజనాలు లభిస్తాయి. అయితే, ఈసారి జియోతో పోటీ పడటానికి ఎయిర్‌టెల్ ఆసక్తికరమైన ఆఫర్ తో ముందుకు వచ్చింది. ఎయిర్‌టెల్ బ్రాడ్ బ్యాండ్ కస్టమర్ల కోసం ఇప్పుడు కంపెనీ అపరిమిత డేటాను అందించబోతోంది.
నివేదికల ప్రకారం, ఎయిర్టెల్ తమ వినియోగదారులకు అన్ని బ్రాడ్ బ్యాండ్ ప్లాన్స్ పైన అపరిమిత డేటాను అందిస్తోంది. Airtel బ్రాడ్‌బ్యాండ్ సేవను ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ద్వారా అందిస్తోంది. అయితే, ఈ విషయంపై ఎయిర్‌టెల్ ఇంకా వ్యాఖ్యానించలేదు. కానీ, ఈ సౌకర్యం కొత్త వినియోగదారులకు అందుబాటులో లేదు. ఈ ఆఫర్ కేవలం ఎయిర్‌టెల్‌తో అనుబంధంగా ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది.
ఎయిర్టెల్ ప్రాథమికంగా బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్ల కోసం నాలుగు ప్లాన్ లతో వస్తుంది. అయితే, సంస్థ ఇప్పుడు తక్కువ ధరలో మరొక సరసమైన ప్లాన్ అయిన రూ.499 ప్లాన్ కూడా తీసుకొచ్చింది మరియు ఈ ప్లాన్ తో 40Mbps స్పీడ్ తో అందుకోవచ్చు. ఇక ప్రీమియం ప్రాథమిక ప్లాన్ 799 రూపాయల నుండి మొదలవుతుంది, దీనిలో వినియోగదారులు 100 Mbps వేగంతో 150 GB డేటాను ఉపయోగించుకునే అవకాశం లభిస్తుంది. ఇది కాకుండా, 999 రూపాయల ప్లాన్ కూడా ఉంది, ఇది ఎంటర్టైన్మెంట్ ప్లాన్. ఈ ప్లాన్ లో 300 GB డేటా 200 Mbps వేగంతో లభిస్తుంది.
ఇక ఎయిర్‌టెల్ ప్రీమియం లో, VIP ప్లాన్స్ వరుసగా రూ .1,499, రూ .3,999 కూడా ఉన్నాయి. ఈ రెండు ప్లాన్ లలో వినియోగదారులకు 300 Mbps, 1 Gbps స్పీడ్ ఇవ్వబడుతుంది. VIP ప్లాన్ వినియోగదారులకు అపరిమిత డేటాను అందిస్తుంది మరియు ప్రీమియం ప్లాన్ 500 GB వరకు డేటాను అందిస్తుంది. మీరు అదనపు డేటాను ఉపయోగించాలనుకుంటే, అధనంగా రూ .299 చెల్లించాలి, ఇది యాడ్-ఆన్ ప్లాన్.
ఇక జియో ఫైబర్ ప్లాన్ గురించి మాట్లాడితే, ఇప్పుడు జియో ఫైబర్ ప్లాన్స్ అతితక్కువ ధరతో రూ. 399 రూపాయల నుండి మొదలవుతుంది. అధనంగా, జియో ఫైబర్ ప్లాన్ కొత్త కస్టమర్లకు 30 రోజుల ఉచిత ట్రయల్ ఇస్తుంది కాబట్టి ఏదైనా ప్లాన్ తీసుకునే ముందు, జియో ఫైబర్ ను ఉచితంగా ఉపయోగించటానికి ప్రయత్నించే అవకాశం కూడా ఉంది OTT ప్లాట్‌ఫారమ్‌లోని చలనచిత్రాల నుండి ఇంటి నుండి ఆన్‌లైన్‌లో పనిచేయడం వరకు ప్రతిదానికీ ఇంటర్నెట్ వాడకం పెరిగింది. కాబట్టి జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ చందాదారుల సంఖ్య కూడా పెరిగింది.