టెలికాం కంపెనీలు ప్రస్తుతం వారి ప్రీపెయిడ్ మరియు పోస్ట్ పైడ్ ప్లాన్ లను అప్డేట్ చేసుకుంటున్నాయి. మొదట, జియో తన ప్రెజంట్ ప్లాన్ ధరలను మార్చింది. రిలయన్స్ జీయో యొక్క ప్లాన్ల అప్డేట్ తర్వాత ఖరీదైనవిగా మారాయి. అంటే, జియో కొన్ని ప్లాన్ ల యొక్క ధరలను పెంచింది , కొన్ని ప్లాన్ ల వాలిడిటీ తేదీని తగ్గించాయి.
దీని తరువాత, ఎయిర్టెల్, వొడాఫోన్ మరియు ఐడియా కూడా వారి ప్లాన్ లను మార్చాయి. ఎయిర్టెల్ దాని ప్లాన్ లను కూడా అప్డేట్ చేసింది . కొన్ని ప్లాన్ లు ఒకటిన్నర రెట్లు ప్రయోజనం లభిస్తుంది . ఎయిర్టెల్ యొక్క ఈ ప్లాన్ ల వివరాలు తెలుసుకుందాం పదండి .
రూ. 349 ప్లాన్ – ఎయిర్టెల్ తన అత్యంత ప్రజాదరణ పొందిన రూ .349 ప్లాన్ ని రివైజ్ చేసింది . అప్డేట్ చేసిన తర్వాత, 349 రూపాయల ప్లాన్ 28 రోజుల కు 1.5 GB డేటాను పొందవచ్చు . ఈ ప్లాన్ లో ముందు రోజుకు 1 GB డేటా వచ్చేది .