ఇండియాలో 5G సర్వీస్ కోసం క్వాల్కమ్ తో జతకట్టిన ఎయిర్టెల్

Updated on 24-Feb-2021
HIGHLIGHTS

5G సర్వీస్ కోసం క్వాల్కమ్ తో జతకట్టిన ఎయిర్టెల్

ఎయిర్టెల్ మరియు క్వాల్కమ్ టెక్నాలజీస్ సహకారంతో 5G

బారతి ఎయిర్టెల్, ఇండియాలో 5G సర్వీస్ కోసం క్వాల్కమ్ తో జతకట్టింది. ఇటీవలే తన 5G సర్వీస్ ను నిర్విఘ్నంగా పరీక్షించిన ఎయిర్టెల్ తన 5G సర్వీస్ ను ఇండీయాలో అందించాడని క్వాల్కమ్ ని పార్ట్నర్ గా ఎంచుకుంది. ఎయిర్టెల్ ఈ ప్రముఖ చిప్ తయారీ సంస్థ యొక్క రేడియో యాక్సెస్ నెట్వర్క్ (RAN) ను ఉపయోగించేలా కనిపిస్తుంది.

వర్చువలైజ్డ్ ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్వర్క్ O-RAN యొక్క బోర్డ్ మెంబర్ గా, ఎయిర్టెల్ ఈ O-RAN బేస్డ్ 5G నెట్వర్క్ ను తీసుకురావడానికి మరియు క్వాల్కమ్ టెక్నాలజీస్ తో కలిసి దీనిని విస్తరించడానికి మరియు అమలు చెయ్యడానికి కృషిచేస్తుంది. ఇప్పటికే, ఎయిర్టెల్ తన డెమోన్స్ట్రేషన్ తో ఏక కాలంలో 4G మరియు 5G నిర్వహించవచ్చని చూపించింది.

అయితే, ప్రస్తుతం వేగవంతమైన బ్రాండ్ బ్యాండ్ సర్వీస్ లు ఖర్చుతో కూడుకున్నవిగా ఉండగా, ఎయిర్టెల్ మరియు క్వాల్కమ్ టెక్నాలజీస్ సహకారంతో 5G ఫిక్సెడ్ వైర్ లెస్ యాక్సెస్ తో సహా అనేక ఉపయోగాలను చిన్న బిజినెస్ మొదలుకొని ఇళ్ల వరకూ గిగా బిట్ వేగంతో బ్రాడ్ బ్యాండ్ కనక్టివిటీని అందించడానికి రూపొందించాబడ్డాయని కూడా ఎయిర్టెల్ పేర్కొంది.             

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :