జియో తన 399 రూపీస్ ప్యాక్ పై 100% క్యాష్ బ్యాక్ ఇస్తే ఎయిర్టెల్ కూడా ఒక కొత్త ఆఫర్ తో వచ్చింది . ఎయిర్టెల్ యొక్క కొత్త రీఛార్జ్ ప్యాక్ ఇప్పుడు అందుబాటులో కలదు. ఇది మొత్తం 50జీబీ డేటా తో వస్తుంది . ఈ ప్యాక్ ని యూజర్స్ 999 రూ లో పొందవచ్చు . కానీ ఈ ఆఫర్ కేవలం పోస్ట్ పైడ్ యూజర్స్ కి మాత్రమే .
ఎయిర్టెల్ యొక్క ఈ కొత్త ప్లాన్ myplan ఇన్ఫినిటీ పోస్ట్ పైడ్ ప్లాన్.ఇది 50 జీబీ డేటా తో పాటుగా అన్లిమిటెడ్ కాల్స్ కూడా ఆఫర్ చేస్తుంది .ఈ ఆఫర్ తో కంపెనీ అధిక డేటా వాడుకొనే యూజర్స్ ని టార్గెట్ చేస్తుంది . ఈ ప్లాన్ లో రోమింగ్ కూడా ఫ్రీ . ఇది కొత్త పాత మరియు ఇద్దరు పోస్ట్ పైడ్ యూజర్స్ కి అందుబాటులో కలదు కాబట్టి మీరు ఇప్పుడు పోస్ట్ పైడ్ కి మారడం గురించి ఆలోచిస్తే, ఇది సరైన సమయం. ఈ ఆఫర్ కంపెనీ యొక్క డేటా రోల్ ఓవర్ కింద వస్తుంది.అంటే మీరు మిగిలిన డేటా ని వచ్చే బిల్లింగ్ సైకిల్ లో యాడ్ చేయొచ్చు . ఇదే కాక కంపెనీ యూజర్స్ కి ఎయిర్టెల్ సెక్యూర్ సర్వీస్ కూడా ఫ్రీ గా 6 నెలలకి ఇస్తుంది .
ప్రీపెయిడ్ వినియోగదారులకు ఎయిర్టెల్ రూ .999 ఆఫర్ ఇచ్చింది.దీనిలో యూజర్స్ కి 112జీబీ డేటా ఇవ్వబడేది . దీనిలో ప్రతీ రోజూ 4జీబీ డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ ఫెసిలిటీ యూజర్స్ కి లభ్యం. డేటా యొక్క ప్రయోజనం స్పష్టంగా ప్రీపెయిడ్ వినియోగదారులకు ఎక్కువగా ఉంటుంది, కానీ పోస్ట్పెయిడ్ వినియోగదారులకు డేటా లిమిట్ లేదు.