భారతీ ఎయిర్టెల్ రూ .399 ప్రీపెయిడ్ ప్లాన్-
ఎయిర్టెల్ యొక్క రూ 399 ప్లాన్ 84 రోజుల వాలిడిటీ తో వస్తుంది. ఈ ప్లాన్ లో , వినియోగదారులు 4G నెట్వర్క్ స్పీడ్ తో రోజుకు 1.4 GB డేటాను పొందుతారు. దీనితో పాటు, వినియోగదారులు ఈ ప్లాన్ లో రోజువారీ 100 SMS (లోకల్ మరియు నేషనల్ ) మరియు అపరిమిత వాయిస్ కాల్స్ (లోకల్ , STD మరియు రోమింగ్) పొందుతారు. అదనంగా, వినియోగదారులు ఎయిర్టెల్ యాప్ లో 84 రోజులు ఉచిత సబ్స్క్రిప్షన్ ను పొందుతారు.
రిలయన్స్ జియో యొక్క రూ .399 ప్రీపెయిడ్ ప్లాన్-
జియో యొక్క ఈ ప్లాన్ ప్రారంభ టారిఫ్ ప్లాన్లో ఒకటి. ఈ ప్లాన్ లో , వినియోగదారులు 4G స్పీడ్ వద్ద రోజుకు 1.5 GB డేటాను పొందుతారు. ఎయిర్టెల్ మాదిరిగా, ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ 84 రోజులు. ఈ ప్లాన్ లో, ప్రతిరోజూ 100 SMS (లోకల్ మరియు నేషనల్ ) మరియు అపరిమిత వాయిస్ కాల్స్ (లోకల్ , STD మరియు రోమింగ్) వినియోగదారులు పొందుతారు. 84 రోజులు మై జియో యాప్ మరియు జియో TV యాప్ పై ఉచిత సబ్స్క్రిప్షన్ పొందుతారు.