జియోకి షాక్ ఇచ్చిన ఎయిర్టెల్: POCO లేటెస్ట్ ఫోన్ తో భారీ కాంబో అఫర్.!

HIGHLIGHTS

ఎయిర్టెల్ తన లేటెస్ట్ Airtel Exclusive అఫర్ తో జియోకి షాకిచ్చింది

Flipkart Big Saving Days సేల్ నుండి ఈ ఎక్స్ క్లూజివ్ అఫర్ ను ప్రకటించింది

ఈ ఎయిర్టెల్ అఫర్ ద్వారా రూ. 5,999 అఫర్ ధరకే Poco C51 కొనుగోలు చెయవచ్చు

ఎయిర్టెల్ తన లేటెస్ట్ Airtel Exclusive అఫర్ తో జియోకి షాకిచ్చింది. అతి తక్కువ ధరకే 4G మొబైల్ ను ప్రీపెయిడ్ ప్లాన్ తో అఫర్ చేస్తున్న జియోకి పోటీగా ఈ అఫర్ ను రంగంలోకి దించినట్లు కనిపిస్తోంది. Flipkart Big Saving Days సేల్ నుండి ఈ ఎక్స్ క్లూజివ్ అఫర్ ను ప్రకటించింది. ఈ అఫర్ ద్వారా Poco C51 స్మార్ట్ ఫోన్ భారీ డిస్కౌంట్ మరియు ఎయిర్టెల్ ఉచిత డేటా అఫర్ తో పాటుగా మరిన్ని ప్రయోజనాలతో అందుకోవచ్చు. ఎయిర్టెల్ అందించిన ఈ సరికొత్త ఎక్స్ క్లూజివ్ అఫర్ వివరాలు పూర్తిగా తెలుసుకోండి.

ఏమిటి ఈ Airtel Exclusive అఫర్?

ఎయిర్టెల్ ఎక్స్ క్లూజివ్ అఫర్ ద్వారా పోకో లేటెస్ట్ 4G స్మార్ట్ ఫోన్ Poco C51 పైన రూ. 1,000 రూపాయల భారీ డిస్కౌంట్ ను అఫర్ చేస్తోంది. మార్కెట్ లో రూ. 6,999 ధరతో అమ్ముడవుతున్న ఈ పోకో స్మార్ట్ ఫోన్ ను ఈ ఎయిర్టెల్ అఫర్ ద్వారా రూ. 5,999 అఫర్ ధరకే కొనుగోలు చెయవచ్చు. 

Airtel Exclusive అఫర్ ఎరికి వర్తిస్తుంది?

ఈ అఫర్ ఇప్పటికే కొనసాగుతున్న ఎయిర్టెల్ కస్టమర్లకు మరియు ఎయిర్టెల్ కి పోర్ట్ అవ్వదలుచుకున్న యూజర్లకు వర్తిస్తుంది. 

Airtel Exclusive అఫర్ కండిషన్స్ ఏమిటి?

Airtel Exclusive అఫర్ కోసం కొన్ని కండీషన్స్ ను ఎయిర్టెల్ జత చేసింది. ఎయిర్టెల్ జత చేసిన ఈ కండీషన్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ రూ.199 లేదా అంతకంటే పైబడిన రీఛార్జ్ 18 నెలలు చేసేలా సెట్ చెయ్యబడుతుంది. అంటే, రూ. 199 పైన మీకు నచ్చిన ఏ ప్లాన్ అయినా మీరు రీఛార్జ్ చేయవచ్చు. 

ఈ డ్యూయల్ SIM ఫోన్ లో మెయిన్ సిమ్ ఎయిర్టెల్ ని ఉయోగించాల్సి ఉంటుంది. అలాగే, రెండవ SIM కార్డ్ ఇతర నెట్ వర్క్ వాడుకోవచ్చు. అంతేకాదు, ఈ ఎయిర్టెల్ ఎక్స్ క్లూజివ్ అఫర్ ద్వారా 50GB అదనపు ఉచిత డేటా కూడా లబిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :