AI Scam: QR కోడ్, ఫోన్ కాల్ మరియు వాట్సాప్ స్కామ్ నుంచి ఎలా తప్పించుకోవాలి.!

Updated on 01-Sep-2025
HIGHLIGHTS

ఎలాంటి పనులనైనా చిట్టికలో చేసే సత్తా కలిగిన ఎఐ సపోర్ట్ తో కొత్త స్కామ్

ఈ మోసాలను అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటూనే ఉంది

ప్రజలు ఎక్కువ అవగాహన కలిగి ఉండటం ద్వారా ఈ మోసాలు చేసే వారి ఆట కట్టించవచ్చు

AI Scam: నానాటికీ టెక్నాలజీ పెరుగుతుందని సంతోషపడాలో లేక అదే టెక్నాలజీతో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని బాధపడాలో అర్థం కాని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఎలాంటి పనులనైనా చిట్టికలో చేసే సత్తా కలిగిన ఎఐ సాధించిన తీరు ఒక పైపు ఉంటే, దాన్ని ఉపయోగించి అమాయక ప్రజలను దోచుకుంటున్న బాధ మరోవైపు ఉంది. ఈ మోసాలను అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటూనే ఉంది. అయితే, ఈ కొత్త మోసాల పై ప్రజలు ఎక్కువ అవగాహన కలిగి ఉండటం ద్వారా ఈ మోసాలు చేసే వారి ఆట కట్టించవచ్చు. అందుకే, ఎఐ ఆధారిత QR కోడ్, ఫోన్ కాల్ మరియు వాట్సాప్ స్కామ్ నుంచి ఎలా తప్పించుకోవాలో వివరించే ప్రయత్నం చేశాను.

AI Scam: అంటే ఏమిటి?

ఈమధ్య కాలంలో స్కామర్లు ప్రజలను మోసం చేయడానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ని కూడా ఉపయోగిస్తున్నారు. ఇది ప్రజలను చాలా గొప్పగా బురిడీ కొట్టిస్తోంది. ప్రజలను మోసం చేయడానికి ఎఐ సహాయంతో డిజిటల్ అరెస్ట్, AI డ్రివెన్ మెసేజ్, ఎఐ జెనరేట్ QR కోడ్ మరియు ఎఐ క్రియేట్ వాట్సాప్ మెసేజ్ లతో మరింత విస్తృతంగా స్కామ్ లకు తెరలేపుతున్నారు. ఇందులో ఒక్కొక్క స్కామ్ ఒక్కోలా ఉంటుంది. ఇవన్నీ కూడా ఎఐ సహాయంతో నిర్మిస్తున్నారు. అందుకే, వీటిని ఎఐ స్కామ్ గా పిలుస్తున్నారు.

వాట్సాప్ ఎఐ స్కామ్

ఇది మీ డేటా ఉపయోగించి మిమ్మల్ని ఇరుకున పెట్టే స్కామ్. అంటే, మీ వాట్సాప్ అకౌంట్ యొక్క స్టేటస్ మరియు DP వంటి వివరాలతో స్కామర్లు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు. ఈ స్కామ్ లో మీ కుటుంబ సభ్యులు, చుట్టాలు లేదా స్నేహితుల వాయిస్ పోలిన ఎఐ వాయిస్ తో అర్జెంటుగా డబ్బులు పంపాలంటూ ఫేక్ వాయిస్ మెసేజ్ తో మిమ్మల్ని దోచుకునే ప్రయత్నం చేస్తారు. ఇలా చేయడానికి ఎఐ వాయిస్ క్లోన్ ని ఉపయోగిస్తారు. మరింత ఆశ్చర్యం ఏమిటంటే వారి ఫోటోలతో కూడిన ఫేక్ DP లను కూడా సెట్ చేసుకునే అవకాశం ఉంది.

ఫేక్ QR Code స్కామ్

ఇది చాలా కాలంగా కొనసాగుతున్న మరియు సుపరిచితమైన స్కామ్. డబ్బులు రిసీవ్ చేసుకోవడానికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, అని రిక్వెస్ట్ పంపిస్తారు. ఈ కోడ్ స్కాన్ చేస్తే మీ అకౌంట్ ఖాళీ అవుతుంది. ఎందుకంటే, అది చూడటానికి ఏదో పెద్ద కంపెనీ లేదా ఆర్గనైజేషన్ కి సంబంధించిన క్యూఆర్ కోడ్ మాదిరిగా ఉంటుంది కానీ వాస్తవానికి వివరాలు క్లియర్ గా ఉండేలా ఎఐ తో క్రియేట్ చేసిన క్యూఆర్ కోడ్ స్కాన్ అది.

Also Read: Realme 15T టాప్ ఫీచర్లు మరియు ప్రైస్ లాంచ్ కంటే ముందే తెలుసుకోండి.!

AI ఫోన్ కాల్ స్కామ్:

ఎఐ సహాయంతో రూపొందించిన deepfake voice calls తో కొత్త మోసాలకు తెరలేపారు. ఇందులో సర్వీస్ కాల్స్, బ్యాంక్ కస్టమర్ కేర్ ఏజెంట్ లేదా కొన్ని సార్లు నిజమైన టెక్నాలజీ మరింత తోడైతే బ్యాంక్ నెంబర్ స్పూఫ్ చేసి కూడా కాల్ చేసే అవకాశం ఉంటుంది. ఈ చర్యలన్నీ కూడా నిజానికి చాలా దగ్గరగా ఉండేలా చూడడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వారు ఉపయోగిస్తారు.

అయితే, ఇలాంటి మోసాల నుంచి కూడా మీరు సురక్షితంగా ఉండటానికి లేదా తప్పించుకోవడానికి కొన్ని సేఫ్టీ సూచనలు అవలంబిస్తే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

AI స్కామ్ నుంచి తప్పించుకోవడానికి తగిన సేఫ్టీ సూచనలు ఏమిటి?

అర్జెంట్ గా డబ్బులు కావాలంటూ మీ కుటుంబ సభ్యులు లేదా తెలిసిన వారి వద్ద నుంచి ఏదైనా వాయిస్ మెసేజ్ వస్తే, ముందుగా వారికి నేరుగా కాల్ చేసి విషయం అడగండి. వారిని కలిసి వివరాలు తెలుసుకోవడం ఇంకా ఉత్తమం. అంతేకానీ, ఇలాంటి మెసేజ్ లకు నేరుగా స్పందించడం లేదా సమాధానం ఇవ్వడం వంటివి చేయకండి.

ప్రజలంతా కూడా బ్యాంక్ కమ్యూనికేషన్ గురించి అవగాహన కలిగి ఉండాలి. బ్యాంక్ వ్యవస్థ ఎప్పుడు కూడా మీ అకౌంట్ పాస్వర్డ్, OTP లేదా UPI వంటి వాటిని అడగవు మరియు వాటితో బ్యాంక్ లకు ఎలాంటి అవసరం ఉండదు. QR Code సేఫ్టీ కూడా దాదాపు ఇలాంటిదే అని చెప్పాలి. మీరు డబ్బులు రిసీవ్ చేసుకోవడానికి మీరు క్యూఆర్ స్కాన్ చేయాల్సిన అవసరం ఉండదు మరియు ఇది పేమెంట్ సిస్టం కు విరుద్ధంగా ఉంటుంది. మీరు డబ్బులు పంపడానికి మాత్రమే స్కాన్ చేస్తారు. అందుకే, డబ్బులు రిసీవ్ కోసం స్కాన్ వంటి వాటిని ఎప్పుడు చేయకండి.

Also Read: Flipkart Big Billion Days: పండుగ సీజన్ సేల్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్.!

APP పర్మిషన్ సేఫ్టీ

మీ ఫోన్ లో ఉపయోగించే APPs కోసం పర్మిషన్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. అన్ని యాప్స్ కి పూర్తి పర్మిషన్ ఇవ్వకూడదు. ముఖ్యంగా, మీ ఫోన్ లో రిమోట్ యాక్సెస్ యాప్‌లు (AnyDesk, TeamViewer) వంటివి ఉన్నాయోమో అని తరువుగా చెక్ చేసుకోవాలి. ఒకవేళ వాటిని ఉపయోగించాల్సి వస్తే చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. ఎందుకంటే, ఇది మీ ఫోన్ పూర్తి కంట్రోల్ ను ఇతరులకు అందిస్తుంది.

AI స్కామ్ పై కొత్త చర్యలు ఏమిటి?

మైక్రోసాఫ్ట్, మెటా మరియు గూగుల్ వంటి టెక్ దిగ్గజాలు AI-జనరేటెడ్ వాయిస్ మరియు ఇమేజ్ లను గుర్తించడానికి తగిన టూల్స్ తీసుకురావడానికి శ్రమిస్తున్నాయి. అంతేకాదు, ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ విభాగం CERT-In ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా సెక్యూరిటీ అలర్ట్స్ విడుదల చేస్తూనే ఉంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :