Aditya-L1 Selfie: అంతరిక్షం నుండి భూమి మరియు చంద్రుని Selfie Video పంపింది.!

HIGHLIGHTS

సూర్యుని దగ్గర నుండి స్టడీ చెయ్యడానికి భారత్ చేప్పట్టిన అద్భుతమైన మిషన్ Aditya-L1

ditya-L1 అంతరిక్ష నౌక, భూమి మరియు చంద్రుని సెల్ఫీ ఫోటో ను భూమికి పంపింది

Lagrange Point 1 ను చేరుకొవడానికి చేస్తున్న ప్రయాణంలో ఈ అద్భుతాన్ని చిత్రీకరించింది

Aditya-L1 Selfie: అంతరిక్షం నుండి భూమి మరియు చంద్రుని Selfie Video పంపింది.!

సూర్యుని దగ్గర నుండి స్టడీ చెయ్యడానికి భారత్ చేప్పట్టిన అద్భుతమైన మిషన్ లో భాగంగా పంపిన Aditya-L1 అంతరిక్ష నౌక, అతిసమీపం నుండి భూమి మరియు చంద్రుని సెల్ఫీ ఫోటో ను భూమికి పంపింది. ఈ సెల్ఫీ వీడియో లో భూమి చుట్టూ తిరుగుతున్న చంద్రుడు ఒకే లైన్ లో కనిపించారు. ఈ అద్భుతాన్ని Aditya-L1 Selfie వీడియో రూపంలో చిత్రీకరించింది. సూర్యుని ను స్టడీ చెయ్యడానికి సరైన దూరమైన భూమి మరియు సూర్యుని యొక్క Lagrange Point 1 ను చేరుకొవడానికి చేస్తున్న ప్రయాణంలో ఈ అద్భుతాన్ని చిత్రీకరించింది. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Aditya-L1 Selfie:

Aditya-L1 సక్సెస్ ఫుల్ గా భూమి నుండి నింగికెగసింది మరియు గమ్య స్థానమైన Lagrange Point 1 ను చేరుకోవడానికి పయనిస్తోంది. ఇది Lagrange Point 1 ను చేరుకోవడానికి, ముందుగా 16 రోజులు భూమి బంధిత కక్షలో ఉంటుంది. ప్రస్తుతం ఈ భూమి బంధిత కక్షలో ఉన్న ఆదిత్య -L1 అంతరిక్ష నౌక ఈ అద్భుతాన్ని చిత్రీకరించి భూమి పైకి పంపింది.

Aditya-L1 Selfie.jpg

Aditya-L1 పంపిన Selfie ఫోటో

Aditya-L1 పంపిన సెల్ఫీ వీడియోలో భూమి చుట్టూ తిరుగుతున్న భూమిని చూడవచ్చు. ఆదిత్య-L1 నౌక భూమి మరియు చంద్రుని వీడియోలు మరియు ఫోటోలను కూడా సంగ్రహించింది. ఇది 110 రోజుల సుదీర్ఘ ప్రయాణం తరువాత ఆదిత్య-L1 అంతరిక్ష నౌక గమ్య స్థానాన్ని చేరుకుంటుంది.

చంద్రుని దక్షిణ ధ్రువం పై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత్ ను నిలబెట్టిన చంద్రయాన్ – 3 సక్సెస్ తరువాత ISRO వెంటనే ఈ Aditya-L1 Mission  ను సక్సెస్ ఫుల్ లాంచ్ చేసింది మరియు నిర్వీరామంగా పర్యవేక్షిస్తోంది. ఈ కొత్త మిషన్ సక్సెస్ తో భారత క్రాంతి మరింతా విరాజిల్లుతుంది.

ఆదిత్య-L1 అంతరిక్ష నౌక భూకక్ష్య నుండి 15 లక్షల కిలో మీటర్ల దూరం ప్రయాణం చేసి భూమి మరియు సూర్యుని యొక్క Lagrange Point 1 ను చేరుకుంటుంది. అయితే, ఇది భూమికి మరియు సూర్యునికి మధ్య ఉన్న దూరంలో కేవలం 15 మాత్రమే అని గుర్తుంచుకోండి. వాస్తవానికి,  భూమికి మరియు సూర్యునికి మధ్య ఉన్న దూరం 150.77 మిలియన్ క్లియో మీటర్లు. 

Aditya-L1 Mission

ఆదిత్య-L1 అంతరిక్ష నౌక ఈ Lagrange Point 1 చేరుకున్న తరువాత సూర్యుని ఉపరితలం పైన వున్నా వాతావరణాన్ని స్టడీ చేస్తుంది.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile