AC కొనాలనుకుంటున్నారా? అయితే ఈ 5 ముఖ్యమైన విషయాలను తెలుసుకోండి!

Updated on 22-Mar-2022

నానాటికి ఎండల తీవ్రత పెరుగుతోంది మరియు ముందు ముందు రోజుల్లో మరింతగా ఎండలు, తీవ్ర రూపం దాల్చనునట్లు ప్రస్తుతం వాతావరణ శాఖ ప్రకటిస్తున్న వాతావరణ ప్రకటనల ద్వారా తెలుస్తోంది. ప్రజలు ఈ ఎండవేడిమి నుండి తప్పించుకోవడానికి, ఫ్యాన్, కూలర్లు మరియు AC లను ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. వీటన్నిటిలో కూడా AC యొక్క ఎంపిక చాల ఖర్చుతో కూడుకున్నదిగా ఉంటుంది. అలాగే, మార్కెట్లో మనకు చాల చాలా బ్రాండ్స్ యొక్క ఎంపికలు మనల్ని ఏది ఎంచుకోవాలి అనే అయోమయంలో పడేస్తాయి.

అంతేకాదు, AC పరిమాణం మరియు కెపాసిటీ ఇంకా ఏదో కొత్త టెక్నాలజీ అంటూ చాల కంపెనీలు తమ యాడ్స్ తో ఉదరగొడుతుంటాయి. కానీ, వాస్తవానికి AC ని ఎంచుకోవడానికి కొంత పరిశీలన అవసరం. అందుకోసమే, ఒక మంచి AC ని మీరు కొనేలా చేయడానికి, మీకు ఈ కొనుగోలు గైడ్ ద్వారా సహాయం చేయనున్నాము. ఇక్కడ మేము సూచించిన ఈ విషయాలను గుర్తు పెట్టుకుంటే, కచ్చితముగా ఒక మంచి AC ని మీరు ఎంచుకోవచ్చు.

1. గది పరిమాణం

AC కొనుగోలు చేసే ముందుగా మనం గుర్తుంచుకోవాల్సింది, ఆ AC ని ఏ గదిలో అమర్చాలనుకుంటున్నాము. ఎందుకంటే, మనము ఎంచుకునే గది యొక్క పరిమాణాన్ని బట్టి మనం తెసుకోవాల్సిన AC యొక్క కెపాసిటీ ని అంచనా వేయాల్సి ఉంటుంది.

ఉదా : బెడ్ రూమ్, ఒక సాధారణ బెడ్ రూమ్ కోసం 1 టన్ నుండి 1.2 టన్ కెపాసిటీ AC అవసరమవుతుంది. అదే ఒక మీడియం హాల్ కోసం కనీసం 1.5 టన్ AC అవసరమవుతుంది.

2.  విద్యుత్ వినియోగం

AC కొనేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకొవాల్సిన విషయం, విద్యుత్ వినియోగం అని కచ్చితంగా చెప్పోచ్చు. ఎందుకంటే, AC అత్యధికమైన విద్యుత్ వినియోగాన్ని తీసుకుంటుంది. కాబట్టి, మనకు ఎక్కువ బిల్ వస్తుంది. అందుకోసమే, తక్కువ విద్యుత్ వినియోగాన్ని వాడుకుని ఎక్కువగా పనిచేసేలా వుండే AC లను ఎంచుకోవడం మంచిది. ఎక్కువగా స్టార్స్ ఉన్న AC లు ఎక్కువగా ప్రయోజనాలను ఇస్తాయి.

3. కాపర్ కండెన్సర్ కాయిల్

AC కండెన్సర్లు గాలిని చల్లబరచి మనకు అందించానికి కాయిల్స్ ను ఉపయోగించుకుంటాయి. అయితే, మనకు తెలుసు కాపర్ అత్యంత వేగవంతమైన ఉష్ట్న వాహకమని, కాబట్టి కాపర్ కాయిల్స్ ఉన్న AC లను ఎంచుకోవడం ద్వారా అత్యంత త్వరగా చల్లబరిచే స్వభావాన్ని మీరు మీ AC నుండి పొందుతారు.

4. ఇన్వర్టర్ సాంకేతికత

మీకు పూర్తి సేవింగ్స్ అందించే ఒక స్మార్ట్ AC ని కనుక మ్రు కొనాలనుకుంటే ఇన్వర్టర్ టెక్నలాజి కలిగిన AC ని ఎంచుకోవడం ఉత్తమం. ఎందుకంటే, ఇన్వర్టర్ టెక్నలాజి AC లు అతితక్కువగా విద్యుత్తును వినియోగించుకుని పనిచేస్తాయి. కాబట్టి, మీకు తక్కువగా కరెంట్ బిల్ వస్తుంది. అంతేకాకుండా, ఇందులో అందించే సాంకేతికతతో  AC యొక్క కంప్రెషర్ ఎక్కువ కాలంగా పనిచేస్తుంది.

5. అధనపు ఫీచర్లు

ఒక AC ఎంచుకునేప్పుడు ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. సామాన్యంగా, మనకు చాల ఎంపికలతో AC లు దొరుకుతుంటాయి కానీ మన ఇంటి వాతవరణ పరిస్థితులకు అనుగుణమైన ఫిచర్లు కలిగిన వాటిని తెలుసుకుని ఎంచుకోవాలి. ఉదాహరణకు, మీ ప్రాంతంలో హ్యుమిడిటీ ఎక్కువగా ఉంటే గనుక దానికి అనుగుణంగా హ్యూమిడిఫైర్ కలిగిన AC ని ఎంచుకోవాలి. అలాగే, బ్యాక్టీరియా ని తొలగించే ఎంపిక మరియు అనేక విధాలైన మాకు కావాల్సిన వాటిని ఎంచుకొని వాటన్నిటిని కలిగిన ఒక మంచి AC ఎంచుకోండి.

దీని గురించి ఇంతగా ఎందుకు ఆలోచించాలంటే, ఒక సారి కొంటే  AC ని మల్లి మల్లి మార్చలేము కదా, అందుకే మీ డబ్బుకు తగిన విలువను అందిచే సరైన AC కొనండి.                                           

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :