రేపటితో ముగియనున్న ఆధార్ – పాన్ డెడ్ లైన్, ఇలా చేస్తే చిటికెలో PAN – Aadhaar లింక్

Updated on 29-Jun-2020
HIGHLIGHTS

జూన్ 30 వ తేదీవరకు PAN - ఆధార్ కార్డు లింక్ చేయకపోయినట్లయితే, వారి PAN కార్డు నిలిపివేయబడుతుంది.

పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానించడానికి, ఆదాయ పన్ను శాఖ కొత్త ఎస్ఎమ్ఎస్ సేవను ప్రారంభించింది.

ముందుగా ప్రకటించినట్లుగా, మార్చ్ 31 వ తేదీవరకు PAN కార్డును కలిగివున్న ప్రతిఒక్కరూ కూడా ఆధార్ కార్డుతో దాన్ని అనుసంధానం చేయాల్సి ఉండగా, ఈ విపత్కర పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, ఫైనాన్స్ మినిష్టర్ నిర్మలా సీతారామన్, ఈ గడువును జూన్ 30 వరకు పొడిగించారు. ఒకేవేళ,  జూన్ 30 వ తేదీవరకు PAN – ఆధార్ కార్డు లింక్ చేయకపోయినట్లయితే, వారి PAN కార్డు నిలిపివేయబడుతుంది. అంతేకాదు, ప్రజలు ఇబ్బందిపకుండా పాన్-ఆధార్ లైన్ చేయ్యడానికి ఆదాయపు పన్నుశాఖ, ఒక్క SMS తో కూడా లింక్ చేసేలా కూడా సులభమైన మార్గాలను అందిస్తోంది. ఇప్పటి వరకు మీరు గనుక PAN – ఆధార్ లింక్ చేయకపోయినట్లయితే, ఇప్పుడే చేయండి.

పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానించడానికి, ఆదాయ పన్ను శాఖ కొత్త ఎస్ఎమ్ఎస్ సేవను ప్రారంభించింది. దీని కోసం మీ UIDPAN అని టైప్ చేసిన తరువాత స్పేస్ ఇచ్చి మీ ఆధార్ నంబరును ఎంటర్ చేసి ఈ SMS ను 567678 నంబరుకు లేదా 56161 కు పంపాలి. UIDPAN<స్పెస్><ఆధార్ నంబర్><స్పేస్><పాన్ నంబర్> ఈ ఫార్మాట్ లో 567678 నంబరుకు లేదా 56161 కు పంపాలి. అదనంగా, ఇ-ఫైలింగ్ వెబ్సైట్ విభాగానికి ఇది అనుసంధానించబడుతుంది.

ఉదాహరణ : UIDPAN 123456123456 ABCDF2019A  

ఇందుకు, ఇ-ఫైలింగ్ వెబ్ సైట్ యొక్క హోమ్ పేజీలో ఈ విభాగం క్రొత్త  https://incometaxindiaefiling.gov.in లింకును అందిస్తుంది. కాబట్టి ఏ వ్యక్తి అయినా  వాటిని  చేయవచ్చు. మీ ఆధార్ మరియు పాన్ కార్డులో తప్పులు ఉన్నట్లయితే, మీ పేరు, చిరునామా మరియు DOB వంటి ఇతర సమాచారంలోని తప్పులను పరిష్కరించడానికి మీరు ఆధార్ మరియు పాన్ కార్డ్ కేంద్రాలకు వెళ్లాలి.

మీరు ఫారం 60 ను పూర్తి చేయకపోతే, ఇకనుండి ఆస్తిని కొనుగోలు చేయలేరు లేదా విక్రయించలేరు. కార్లు కొనడం, బ్యాంకు లేదా డిమాట్ ఖాతా తెరవడం, లేదా   మ్యూచువల్ ఫండ్స్ కొనడం, ఇంకా 50,000 సెక్యూరిటీల కొనుగోలు 50,000 జీవిత బీమా చెల్లింపులు వంటివి కూడా చేయలేరు. కాబట్టి ఇది నేడు లింక్ ను మరియు సమాచారాన్ని,  మీ స్నేహితులు మరియు సన్నిహితులతో పంచుకోండి

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :