Aadhaar Centers కి వెళ్లే పని లేకుండా AI మరియు Face ID తో అప్‌డేట్ ఫీచర్ తెచ్చిన ప్రభుత్వం.!

Updated on 03-Sep-2025
HIGHLIGHTS

Aadhaar Centers తో పని లేకుండా కొత్త ఆధార్ డిజిటల్ అప్‌డేట్ ఫీచర్స్ కోసం ప్రభుత్వం కొత్త చర్యలు

ఈ మేరకు కొత్త ఫీచర్స్ ను అందించడానికి యూనివర్సల్ క్లయింట్ (UC) సాఫ్ట్‌వేర్ తో కొత్త అప్డేట్ చేసింది

ఈ కొత్త అప్‌డేట్ తో సులభమైన, సెక్యూర్ మరియు మరింత డిజిటల్ ఆధార్ అప్‌డేట్ కు వీలు కల్పిస్తుంది

ఆధార్ అప్డేట్ కోసం Aadhaar Centers వద్ద క్యూలో గంటలు గంటలు ఎదురు పరిస్థితి లేకుండా కొత్త ఆధార్ డిజిటల్ అప్డేట్ ఫీచర్స్ కోసం ప్రభుత్వం కొత్త చర్యలు చేపట్టింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఈ మేరకు కొత్త ఫీచర్స్ ను అందించడానికి యూనివర్సల్ క్లయింట్ (UC) సాఫ్ట్‌వేర్ తో కొత్త అప్డేట్ చేసింది. ఈ కొత్త అప్డేట్ తో సులభమైన, సెక్యూర్ మరియు మరింత డిజిటల్ ఆధార్ అప్డేట్ కు వీలు కల్పిస్తుంది.

కొత్త అప్‌డేట్ తో Aadhaar Centers వెళ్లే అవసరం ఎందుకు ఉండదు?

కొత్త అప్డేట్ తో ఆధార్ సెంటర్ వెళ్లే అవసరం ఎందుకు ఉండదు? అని ముందుగా మీకు సందేహం రావచ్చు. ఎందుకంటే, ప్రతి అప్డేట్ కోసం ఆధార్ సెంటర్ వద్ద రోజంతా ఎదురు చూపులు చూసే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. మరి ఆధార్ సెంటర్ కి వెళ్లే పని లేదంటే, అది నిజంగా మంచి విషయం అవుతుంది.

ఇక అసలు విషయానికి వస్తే, UIDAI కొత్తగా తెచ్చిన UC సాఫ్ట్‌వేర్ వలన ఆధార్ అప్డేట్ మరింత వేగం అవుతుంది. ఇందులో ఉన్న రియల్ టైమ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తో ఆధార్ వెరిఫికేషన్ చిటికెలో చేసేస్తుంది. ఇదే కాదు 2025 నవంబర్ నాటికి రానున్న కొన్ని కొత్త అప్డేట్స్ తో ఆధార్ సెంటర్ కి వెళ్లే పనిలేకుండా అడ్రస్ తో సహా మరికొన్ని ఆధార్ అప్ డేట్ లను యాప్ లోనే అప్డేట్ చేసుకునే అవకాశం అందిస్తుంది. అంటే, 2025 నవంబర్ నెల నుంచి పూర్తిగా ఆన్‌లైన్ అప్‌డేట్స్ అవకాశం ఆధార్ కార్డు హోల్డర్స్ కి లభించే అవకాశం ఉంటుంది. లక్నో లో జరిగిన ట్రైనింగ్ వర్క్ షాప్ లో ఈ అప్డేట్ గురించి వెల్లడించింది.

e-Aadhaar మొబైల్ యాప్

ఈ కొత్త అప్డేట్స్ తో పాటు e-Aadhaar మొబైల్ యాప్ గురించి కూడా UIDAI ప్రస్తావించింది. త్వరలో లాంచ్ కాబోతున్న ఈ యాప్ AI అండ్ Face ID సపోర్ట్ తో ఉంటుంది. ఇది డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, మొబైల్ నెంబర్ వంటి వాటిని యాప్ ద్వారా నేరుగా అప్డేట్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. అంటే, ఆధార్ యూజర్లకు ఆధార్ సెంటర్ కి వెళ్లే అవసరం బాగా తగ్గుతుంది. దీనికోసం ఆటోమేటిక్ డాక్యుమెంట్ ఫెచ్చింగ్ ప్రాసెస్ ను ఉపయోగిస్తుంది. ఈ ప్రొసెస్ తో ఆధార్ అప్డేట్ చేయడం చాలా సులభం మరియు వేగం అవుతుంది.

ఆధార్ సెక్యూర్ QR కోడ్ స్కానర్

UIDAI రీసెంట్ గా తెచ్చిన కొత్త ఆధార్ QR కోడ్ స్కానర్ యాప్ తో ఆఫ్ లైన్ లో కూడా ఆధార్ వెరిఫికేషన్ చేయవచ్చు. ఈ ఫీచర్ నకిలీ ఆధార్ కార్డు లను అడ్డుకోవడం మరియు నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది ఎన్క్రిప్టెడ్ మరియు టాంపర్-ప్రూఫ్ QR కోడ్‌లు మాత్రమే గుర్తిస్తుంది. ఇదే కాదు త్వరలో Masked లేదా Secure QR Code ద్వారా డిటైల్స్ షేర్ చేసే ప్రక్రియ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

Also Read: భారీ డిస్కౌంట్ తో కేవలం 10 వేల బడ్జెట్ లో లభిస్తున్న 780W Dolby Soundbar

ఆధార్ రీసెంట్ అప్డేట్స్ ఏమిటి?

5–15 ఏళ్ల పిల్లల ఆధార్ కార్డు తో ఫింగర్‌ ప్రింట్ మరియు ఐరిస్ అప్‌డేట్ తప్పని సరి చేసింది కేంద్రం. అలా చేయని ఎడల ప్రభుత్వ సబ్సిడీ మరియు గవర్నమెంట్ సర్వీసులలో ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంటుందని కేంద్రం తెలిపింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :